Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentPriya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్‌...

Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్‌ విసుర్లు

Priya Bhavani Shankar | యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది ప్రియా భవానీ శంకర్‌. యాంకరింగ్‌తో పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చింది.. ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హిట్స్‌ అందుకుంటూ బిజీ అవుతున్న సమయంలో ఈమె గురించి ఓ నెగెటివ్‌ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చానని ప్రియా భవానీ శంకర్‌ చెప్పినట్టుగా ఆంగ్ల మీడియాలో కథనం వచ్చింది. కష్టపడి ఎదుగుతుంటూ ఇలా తనపై తప్పుడు వార్తలు రావడంతో ప్రియా భవానీ శంకర్‌ ఆవేదన చెందింది. దీనిపై సోషల్‌ మీడియాలో మండిపడింది.

ఎక్కువ డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లోకి వచ్చానని ఎప్పుడు చెప్పానని ప్రియా భవానీ శంకర్‌ ప్రశ్నించింది. ఏ ఆధారాలతో ఈ వార్తను రాశారో తెలుసుకోవచ్చా అని నిలదీసింది. ఈ వార్తలపై ముందుగా స్పందించవద్దని అనుకున్నా.. కానీ పాపులర్‌ వెబ్‌సైట్స్‌ కూడా ఇలాంటి వార్తలు రాయడం దురదృష్టకరమని పేర్కొంది. ఇప్పటివరకు అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పేంటని ప్రశ్నించింది.

అవును.. అందరిలాగే నేనూ డబ్బు కోసమే పనిచేస్తున్నా. ఎవరు డబ్బుల కోసం పనిచేయడం లేదు. మీరు అలా చేయట్లేదా? డబ్బుల కోసమే పనిచేస్తున్నామని నటీనటులు చెబితే అంత చీప్‌గా ఎందుకు చూస్తారు? అని ప్రియా భవానీ శంకర్‌ నిలదీసింది. ఒక వ్యక్తిని తక్కువ చేసేలా ఇలాంటి కథనాలు రాయడం తగదని హితవు పలికింది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. తక్కువ చేయకుండా తన పని తాను చేసుకెళ్తున్నానని స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News