Home Entertainment Poonam Kaur | నేను తెలంగాణ బిడ్డనే.. వేరు చేయకండి.. పూనమ్‌ కౌర్‌ భావోద్వేగం!

Poonam Kaur | నేను తెలంగాణ బిడ్డనే.. వేరు చేయకండి.. పూనమ్‌ కౌర్‌ భావోద్వేగం!

Poonam Kaur | తెలంగాణలో పుట్టి పెరిగిన తనను పరాయి వ్యక్తిగా ట్రీట్‌ చేస్తూ వెలివేస్తున్నారని నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. ” నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా అలాంటప్పుడు నా మతం పేరు చెప్పి నన్ను ఎలా వెలివేస్తారు” అంటూ ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాజ్ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వేడుకలకు పూనమ్‌ కౌర్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ.. ‘‘నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేసి చూస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయినని చెబుతుంటారు. నేను ఇక్కడే పుట్టాను. పెరిగాను. నా మతం న‌న్ను నా రాష్ట్రం నుంచి వేరు చేయ‌దు. మీ అంద‌రిలాగానే నేను తెలంగాణ బిడ్డని. నేను మైనార్టీ సిక్కు అమ్మాయిన‌ని చెప్పి వేరుచేస్తున్నారు’’ అని మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

పూన‌మ్ కౌర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్, త్రివిద దళాల్లో పని చేసే మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version