Home Business Wilful defaulters | బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 మంది వీళ్లే.. 92,570 కోట్లు...

Wilful defaulters | బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 మంది వీళ్లే.. 92,570 కోట్లు టోపీ పెట్టేశారుగా.. గత గదేండ్లలో 10 లక్షల కోట్లు రైటాప్ చేసిన బ్యాంకులు

Wilful defaulters | ఉద్దేశపూర్వక ఎగవేత దారుల జాబితాలో ఉన్న టాప్ 50 మంది నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 92 వేల 570 కోట్ల రూపాయలు. ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ లోక్‌సభలో వెల్లడించిన లెక్కలు. దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలే రూ.10,444 కోట్లు ఎగవేశారని కేంద్ర మంత్రి వెల్లడించారు. వీరికి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, నక్షత్ర బ్రాండ్స్, గిలి ఇండియా లిమిటెడ్ కంపెనీల నుంచి 10వేల 444 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

ఈ జాబితాలోని తెలుగు రాష్ట్రాల కంపెనీలు

ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2,311 కోట్ల రూపాయలు, ట్రాన్స్ట్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ 1,932 కోట్ల రూపాయలు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ 1,890 కోట్ల రూపాయలు, ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ 1,766 కోట్ల రూపాయలు ఎగవేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇంకా ఏ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయంటే..

ఎరా ఇన్ ఫ్రా ఇంజినీరింగ్ – 5,879 కోట్లు
రే ఆగ్రో – 4,803 కోట్లు
కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ – 4,596 కోట్లు
ఏబీజీ షిప్ యార్డ్ – 3,708 కోట్లు
ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ – 3,311 కోట్లు
విన్సమ్ డైమండ్ అండ్ జువెలరీ – 2,931 కోట్లు
రోటోమాక్ గ్లోబల్ – 2,893 కోట్లు
జూమ్ డెవలపర్స్ – 2,147 కోట్లు
కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ – 2,311 కోట్లు
ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ – 1,932 కోట్లు
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ల లిమిటెడ్ – 1,890 కోట్లు
ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ – 1,766 కోట్లు

మరోవైపు గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేశాయని కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. దేశంలో NPAలు గత ఐదేళ్ల కాలంలో 8.95 లక్షల కోట్ల నుంచి 5.40 లక్షల కోట్లకు తగ్గినట్లు ఆయన తెలిపారు.

ఉద్దేశపూర్వక రుణవేత ఎగవేతదారులంటే?

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని, రుణాలు చెల్లించగలిగే శక్తి ఉన్పప్పటికీ కావాలని కొంత మంది రుణాల ఎగవేతకు పాల్పడతారు. వీళ్లనే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులని అంటారు. RBI నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు ఐదేళ్ల పాటు మళ్లీ కొత్త రుణాలు ఇవ్వరు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Notice for Taj Mahal | చరిత్రలో తొలిసారి తాజ్‌మహల్‌కు నోటీసులు.. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటూ ఆదేశాలు

Siricilla kidnap | సిరిసిల్ల జిల్లాలో గుడికి వెళ్లి వస్తుంటే యువతి కిడ్నాప్.. తండ్రిని నెట్టేసి ఎత్తుకెళ్లిన దుండగులు

Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?

Gas cylinder for Rs. 500 | రాజస్థాన్‌లో 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Exit mobile version