Home Latest News CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు...

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని, కేబినెట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్ ఆదేశించింది.

వీటితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Farmers | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

CM KCR | బీఆర్‌ఎస్‌ లక్ష్యం అదేనా..? కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

TSPSC JL Notification | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక తొలిసారి నోటిఫికేషన్‌

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

TSPSC Notification | 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

Exit mobile version