Tuesday, April 30, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC AE Paper Leak | అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు.. పేపర్ లీకేజీ ఘటనతో...

TSPSC AE Paper Leak | అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు.. పేపర్ లీకేజీ ఘటనతో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం

TSPSC AE Paper Leak | అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లోని 837 ఏఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 5వ తేదీన నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు మరోసారి రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.

ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని టీఎస్‌పీఎస్సీ సీరియస్‌గా తీసుకుంది. పరీక్షకు రెండు రోజుల ముందు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ లీక్ చేయడంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం దీనిపై విచారణ బాధ్యతలను సిట్‌కు అప్పగించింది. ఆ వెంటనే కేసు దర్యాప్తు కోసం సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ రంగంలోకి దిగారు. ఇక ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళి సై స్పందించారు. బుధవారం తన కార్యాలయంలో 2 గంటల పాటు విచారణ జరిపిన శ్రీనివాస్ కీలక ఆధారాలు సేకరించారు. కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర లక్ష్మీ, చైర్మన్‌, కార్యదర్శి కంప్యూటర్లను పరిశీలించారు. చైర్మన్‌, కార్యదర్శి పేషిల్లో సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు ప్రవీణ్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నుంచి వివరాలను దొంగిలించినట్లు గుర్తించారు.

కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ ఆఫీసర్‌ కంప్యూటర్ ను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌ రిపేర్‌ చేశాడు. ఈ క్రమంలో డైనమిక్‌ ఐపీ అడ్రస్‌ కు బదులు తనకు అనుకూలంగా స్టాటిక్‌ ఐపీ అడ్రస్‌ ను పెట్టాడు. అతని సాయంతోనే ప్రవీణ్‌ క్వశ్చన్‌ పేపర్స్‌ను తన పెన్‌ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏపీ ప్రశ్నాపత్రాలను రేణుకకు 10 లక్షలకు విక్రయించాడు.

సిట్‌ అధికారులు నిందితుని ఎస్‌బీఐ ఖాతాను పరిశీలించగా రేణుక ఇచ్చిన డబ్బును అందులో వేసుకున్నట్లుగా గుర్తించారు. కొద్ది రోజుల తరువాత అందులో 3.5 లక్షల రూపాయలను రాజమండ్రిలోని అతని బాబాయికి పంపినట్లుగా తెలుసుకున్నారు. ఇప్పటికే సిట్‌ మిగతా ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం నాటికి పూర్తి వివరాలు తెలుపుతామని అధికారులు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News