Thursday, June 13, 2024
- Advertisment -
HomeLatest NewsNatu Natu Controversy | నాటు నాటుపై రాజకీయం.. అంత కక్కుర్తి ఎందుకు.. అవార్డు మీరైతే...

Natu Natu Controversy | నాటు నాటుపై రాజకీయం.. అంత కక్కుర్తి ఎందుకు.. అవార్డు మీరైతే తెప్పించలేదుగా..!

Natu Natu Controversy | రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఏదైనా విజయం సాధించినప్పుడు అది తమవల్ల జరిగింది అని చెప్పుకోవడానికి నానా యాతన పడుతుంటారు. ఇప్పుడు కూడా ఆస్కార్ అవార్డు కేవలం తమ పార్టీల వల్ల వచ్చింది అని చెప్పుకోవడానికి మన దేశంలో ఉన్న ప్రముఖ పార్టీలు అన్ని పోటీ పడుతున్నాయి. నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డ్ గురించి ఏకంగా రాజ్యసభలోనే రగడ మొదలైంది.

అక్కడ ఇటు కాంగ్రెస్.. అటు బిజెపి లీడర్స్ అవార్డును క్లైమ్ చేసుకోవడానికి ఎన్నో తండాలు పడ్డారు. అసలు ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. దానికి కారణం కూడా వారు చెప్పారు. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ లేకపోయినా కూడా.. రాజమౌళి సొంతంగా తన ఖర్చు పెట్టుకుని తెలివితేటలతో మన సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లాడని.. ఇందులో మీరు చేసింది ఏమీ లేదు.. ప్రధాని నరేంద్ర మోడీ కథ ఇవ్వలేదు.. డైరెక్షన్ అంతకంటే చేయలేదు అంటూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ ఖార్గే సెటైర్లు వేశారు.

అసలు ట్రిపుల్ ఆర్ సినిమాను ముందు నుంచి బిజెపి పట్టించుకోలేదని.. పైనుంచి దాని విడుదల కానీకుండా ఆపాలని ప్రయత్నించినట్టు గుర్తు చేశారు ప్రతిపక్ష పార్టీ నేతలు. అక్కడితో ఆగకుండా గుజరాతి సినిమా అయిన కారణంగానే చేల్లో షో ఇండియా నుంచి ఆస్కార్ కు అఫీషియల్ నామినేషన్ పొందిందని.. సౌత్ సినిమాను వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేని అంటూ విమర్శలు గుప్పించారు.

మరోవైపు బిజెపి మాత్రం ఆస్కార్ అవార్డు సాధించిన రాజమౌళి అండ్ టీంకు కంగ్రాట్యులేషన్స్ చెప్తూనే.. విజయేంద్ర ప్రసాద్ లాంటి లెజెండరీ రైటర్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది మన ప్రధానమంత్రి మోడీ అంటూ క్లైమ్ చేసుకున్నారు. ఆయన ఇంత గొప్ప రైటర్ అనేది ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది అంటూ రాజ్యసభలో విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు.

అధికార పక్ష నాయకులు మేటర్ ఏదైనా కానీ ఆస్కార్ అవార్డును వాడుకోవాలని రెండు పార్టీలు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించాయి అనేది మాత్రం స్పష్టమైంది. వీళ్ళ హడావిడి చూసి అవార్డు తీసుకొచ్చింది మీరు కాదు కదా.. మీకు ఎందుకు అంత ఆసక్తి అంటూ కామన్ జనం నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Virat Kohli | ఆ భావనే నన్ను తినేసింది.. అంచనాల భారంతో సమస్యలు పెంచుకున్నా.. విరాట్‌ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Hardik Pandya | ఈ మ్యాచ్‌ నెగ్గితే అతడే భావి భారత సారథి.. హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించిన సునీల్‌ గవాస్కర్‌

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

IND vs AUS | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మనదే.. ‘డ్రా’గా ముగిసిన చివరి టెస్టు.. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News