Saturday, May 18, 2024
- Advertisment -
HomeLatest NewsSpy Balloon | అమెరికానే కాదు.. భారత గగనతలంలోనూ స్పై బెలూన్.. చైనా ఆలోచన ఏంటి?

Spy Balloon | అమెరికానే కాదు.. భారత గగనతలంలోనూ స్పై బెలూన్.. చైనా ఆలోచన ఏంటి?

Spy Balloon | అమెరికా గగనతలంలో కొంతకాలంగా వింత వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. చైనానే ఈ స్పై బెలూన్లను ప్రయోగిస్తున్నాయని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో డ్రాగన్ దేశానికి అమెరికా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి సమయంలో 2022లో చైనా స్పై బెలూన్ భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవుల సమయంలో సంచరించినట్లు తాజాగా బయటపడింది. బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవుల మీదుగా ఓ వింత వస్తువు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లిందన్న వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

అండమాన్ నికోబార్ దీవులపై ఓ వస్తువు అకస్మాత్తుగా ప్రత్యక్షమైందని.. భారత్‌కు చెందిన అనేక రాడార్ వ్యవస్థలను తప్పించుకుని ఇది వచ్చినట్లు ఓ వార్తా సంస్థ నివేదికలో వెల్లడైంది. భారత క్షిపణి పరీక్ష కేంద్రాలతో పాటు చైనా, ఇతర దేశాలకు ఇంధనం, ఇతర సామగ్రి రవాణాకు అత్యంత కీలకమైన మలక్కా జలసంధి సమీపంలోనే ఈ బెలూన్ కనిపించింది. ఆ వస్తువు వింతగా కనిపించడంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉన్న చాలా మంది ప్రజలు దాన్ని ఫోటో తీశారు.

ఆ వ‌స్తువు ఏంటో వారికి తెలియక పోయినా ఆశ్చర్యంతో వారంతా ఫోటోలు తీసినట్టు నివేదిక వెల్లడించింది. అయితే అమెరికా గగనతలంలో వరుసగా చైనా స్పై బెలూన్లు ఎగురుతుండటంతో ఈ ఘటనను భారత రక్షణ శాఖ సీరియస్‌గా తీసుకుంది. మరోసారి అలాంటి వస్తువు కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు బెలూన్ కనిపించినప్పుడు.. వాతావరణ పరిశోధనలకు ఉపయోగించేది కావచ్చని భావించామని.. కాకపోతే ఇప్పుడు ఉపేక్షించమని అధికారులు అంటున్నారు. మళ్లీ అలాంటి వస్తువు కనిపిస్తే.. అది గూఢచార్య వస్తువు అవునో కాదో తేల్చుకుని కూల్చేస్తామని చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News