Tuesday, April 30, 2024
- Advertisment -
HomeNewsInternationalChicken Price | కేజీ చికెన్‌ ధర రూ.720.. ఆదివారం నాడు భారీగా పెరిగిన ధర

Chicken Price | కేజీ చికెన్‌ ధర రూ.720.. ఆదివారం నాడు భారీగా పెరిగిన ధర

Chicken Price | అమ్మో కిలో చికెన్‌ రూ.720 ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! ఈ ధర మన దగ్గర కాదులేండీ.. దాయాదీ దేశమైన పాకిస్థాన్‌లో !! ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్‌లో నిత్యవసర ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా చికెన్‌ ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. దీంతో ఆదివారం పూట నాన్‌ వెజ్‌ తిందామని ఆశపడ్డ భోజనప్రియులకు నిరాశే మిగిలింది.

కొద్దిరోజులుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. డాలరుతో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఓ దశలో డాలరుతో పోలిస్తే.. 263 పాకిస్థానీ రూపాయలకు పడిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల కోళ్ల ఫీడ్‌కు తీవ్ర సమస్య ఏర్పడి.. పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్‌ నిలిపివేశారు. పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటంతో చికెన్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

ప్రస్తుతం కరాచీలో కిలో చికెన్ ధర రూ.720గా ఉంది. ఇస్లామాబాద్‌, రావాల్‌పిండి సహా ఇతర నగరాల్లో కిలో చికెన్‌ ధర 700 వరకు ఉంది. లాహోర్‌లో మాత్రం కాస్త తక్కువలో అంటే రూ.550 నుంచి రూ.600 మధ్యలో ఉంది. పాకిస్థాన్‌ చరిత్రలోనే ఇవే అత్యంత గరిష్ఠ ధరలు అని చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News