Tuesday, July 23, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (13-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (13-02-2023 )

Horoscope Today | మేషం

గోప్యంగా వ్యవహరిస్తారు. ముఖ్య కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూల పరచుకోవడానికి మీరు చేసే కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు.

వృషభం

దూర ప్రాంత విద్య విషయాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన చర్చలు వాయిదా పడతాయి. ఇతరుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

మిథునం

ఆర్థిక పరమైన అంశాలు లాభిస్తాయి. గృహం లేక భూమి కొనుగోలు సానుకూల పడుతుంది. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశాలు కలిసివస్తాయి.

కర్కాటకం

వాహన సంబంధమైన విషయాలు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవాలు నేర్పిన పాఠాలతో నేడు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

సింహం

కొంత ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వపరమైన పనులు సానుకూల పరచుకోగలుగుతారు. లీజులు పొడిగింపబడతాయి. కీలక వ్యక్తుల నుంచి వాగ్దానాలు అందుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు.

కన్య

మీ స్థాయి పెరుగుతుంది. మనసులోని భావాలను పరోక్షంగా బంధువర్గానికి తెలియజేస్తారు. ఇరుగుపొరుగువారితో ఏర్పడే విబేధాలు చెప్పుకోదగినవి కాకపోయినా చికాకు కలిగిస్తాయి.

తుల

ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గాక ఇతరత్రా వ్యాపారాల్లో కూడా విస్తరించాలనే ఆలోచన మీలో కలుగుతాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి పేరు పొందుతారు.

వృశ్చికం

నిర్దయగా వ్యవహరిస్తున్న వారిపట్ల నిరసనను వ్యక్తం చేస్తారు. వినోద కార్యక్రమాల కన్నా అభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తారు. స్వల్ప ధనలాభ సూచన కలదు. కొనుగోలు అమ్మకాలను సాగిస్తారు.

ధనుస్సు

గౌరవప్రదమైన పురస్కారాలు అందుకుంటారు. క్రమశిక్షణాయుతంగా మెలుగుతారు. సందర్బోచితంగా వ్యవహరించి లాభపడతారు. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృథా చేయరు.

మకరం

ట్రాఫిక్ రూల్స్ పాటించడం చెప్పదగినది. వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ సాధించడానికిగానూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మనో ప్రశాంతత కలిగి ఉంటారు.

కుంభం

అదృష్టాని కన్నా కృషిని నమ్ముకుంటారు. వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం. మిత్ర బృందాలను మరింత విస్తరింపజేస్తారు. టెండర్స్ లాభిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది.

మీనం

ఆర్థికంగా మరింత పురోగతి సాధించడానికిగానూ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కిందపడ్డ తమదే పై చేయి అనేవారితో జాగ్రత్తగా వ్యవహరించండి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News