LPG Cylinder | గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినందుకు సిబ్బంది డబ్బులు అడుగుతుంటారు. కొంతమంది డెలివరీ బాయ్స్ ఎంత అడిగితే అంత తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం కచ్చితంగా మాకు ఇంతే కావాలని డిమాండ్ చేస్తారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని అడిగితే.. మనం ఏదో వాళ్లకు బాకీ ఉన్నట్లు బిల్డప్ ఇస్తారు. అప్పుడప్పుడు గొడవలకు కూడా దిగుతుంటారు. దీనిపై డీలర్లకు ఫిర్యాదుచేస్తే వాళ్లు కూడా ఇలాగే వ్యవహరిస్తుంటారు. డెలివరీ బాయ్స్‌కు ఛార్జీలు చెల్లించడం ఎక్కడైనా ఉందంటూ సమాధానమిస్తుంటారు. కానీ అలా అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చినప్పుడు అదనంగా ఏ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసపరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు. డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బులు అడగడంపై ఫిర్యాదులు ఇటీవల ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డెలివరీ ఛార్జీల పేరిట ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెలివరీ సమయంలో అదనపు డబ్బుల కోసం వేధిస్తే 1967, 1800 2333 5555 నంబర్లకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
TS Budget | గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పడంతో తొలగిన ప్రతిష్టంభన.. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు
Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్
Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల