Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalVasthu Shastra | ఇంటి గడప మీద కూర్చుంటే అరిష్టమా? సైన్స్ ఏం చెబుతోంది?

Vasthu Shastra | ఇంటి గడప మీద కూర్చుంటే అరిష్టమా? సైన్స్ ఏం చెబుతోంది?

Vasthu Shastra | ఇంటి గడప మీద కూర్చుంటే మంచిది కాదని పెద్దలు చెబుతుండటం వినే ఉంటారు. అలా ఎవరైనా కూర్చుంటే చెడామడా నాలుగు తిట్టేస్తారు కూడా. మరి వాళ్లు అంతగా సీరియస్ కావడానికి కారణమేంటి? గడప మీద కూర్చుంటే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?

హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి గడపను దేవతలా భావిస్తారు. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకునేముందు గడప పెట్టి పూజలు చేస్తారు. ఆడబిడ్డతో పసుపు కుంకుమ పెట్టించి ప్రధాన ద్వారాన్ని నిలబెడతారు. కాబట్టే దైవంగా భావించే గడప మీద కూర్చోవడం మంచిది కాదని చెబుతారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉన్న గడప మీద, దాన్ని ఆనుకుని ఉన్న మెట్టు మీద కూడా కూర్చోవడం అరిష్టం అని అంటారు. అలా ప్రధాన ద్వారం ముందు అడ్డంగా కూర్చుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు, పండితులు చెబుతుంటారు.

గడప మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదని సైన్స్ కూడా సమర్థిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం, కిటికీల నుంచి గాలి, వెలుతురు వస్తుంది. దీంతో పాటు అనేక రకాలు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వస్తుంటాయి. కాబట్టి ప్రధాన ద్వారం ముందు గడప మీద కూర్చుంటే అవన్నీ నేరుగా మనపైకి చేరుతాయి. అవి శరీరంలోకి వెళ్తే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇలా శాస్త్రాల పరంగా చూసినా.. సైన్స్ పరంగా చూసినా గడప మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News