Ott release | సంక్రాంతి సందర్భంగా పోయిన వారం వరుసగా సినిమాలు రిలీజయ్యాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, కల్యాణం కమనీయం వంటి తెలుగు సినిమాలతో పాటు తెగింపు, వారసుడు వంటి తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీసు ముందు సందడి చేశాయి. అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. వీటి దూకుడు కారణంగా ఈ వారం థియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం సందడిగా మారనుంది. భారీ చిత్రాలను రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్, డిస్నీ హాట్స్టార్, జీ 5, నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీలు పోటీపడుతున్నాయి. మరి ఈ వారం స్ట్రీమింగ్ కానున్న చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం..
నెట్ఫ్లిక్స్
రష్మిక, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన మిషన్ మజ్ను సినిమా జనవరి 20వ తేదీన నేరుగా ఓటీటీలో రిలీజవుతుంది.
గతేడాది డిసెంబర్లో రిలీజై బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ధమాకా జనవరి 22న స్ట్రీమింగ్ కానుంది.
కాపా ( మలయాళం), దట్ నైన్టీస్ షో, వుమెన్ ఎట్ వార్ చిత్రాలు జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్స్టార్
ఝాన్సీ సీజన్ 2 ( తెలుగు ) , బిగ్ స్కై సీజన్ 3, అబాట్ ఎలిమెంటరీ సీజన్ 2 జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి. లాస్ట్ మ్యాన్ ఫౌండ్ సీజన్ 1, ది ఎల్ వరల్డ్ జనరేషన్ క్యూ సీజన్ 3 జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
ఆహా
ఐశ్వర్య రాజేశ్ క్యాబ్ డ్రైవర్గా నటించిన డ్రైవర్ జమున తెలుగు, తమిళ భాషల్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ 5
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఛత్రీవాలి సినిమా జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బిగ్బాస్ ఫేం సన్నీ, దివి వాద్యా నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ జనవరి 20 నుంచే స్ట్రీమింగ్ అవ్వనుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్
మార్తే డమ్ టక్, ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెకీనా సినిమాలు జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..
Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం
honey rose | సీనియర్ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్ ఛాన్స్