Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentOtt release | ఈ వారం థియేటర్/ఓటీటీలోకి వస్తున్న సినిమాలివే..

Ott release | ఈ వారం థియేటర్/ఓటీటీలోకి వస్తున్న సినిమాలివే..

Ott release | సంక్రాంతి సందర్భంగా పోయిన వారం వరుసగా సినిమాలు రిలీజయ్యాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, కల్యాణం కమనీయం వంటి తెలుగు సినిమాలతో పాటు తెగింపు, వారసుడు వంటి తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీసు ముందు సందడి చేశాయి. అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. వీటి దూకుడు కారణంగా ఈ వారం థియేటర్‌లో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం సందడిగా మారనుంది. భారీ చిత్రాలను రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్, డిస్నీ హాట్‌స్టార్, జీ 5, నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీలు పోటీపడుతున్నాయి. మరి ఈ వారం స్ట్రీమింగ్ కానున్న చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్

రష్మిక, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన మిషన్ మజ్ను సినిమా జనవరి 20వ తేదీన నేరుగా ఓటీటీలో రిలీజవుతుంది.

గతేడాది డిసెంబర్‌లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ధమాకా జనవరి 22న స్ట్రీమింగ్ కానుంది.

కాపా ( మలయాళం), దట్ నైన్టీస్ షో, వుమెన్ ఎట్ వార్ చిత్రాలు జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఝాన్సీ సీజన్ 2 ( తెలుగు ) , బిగ్ స్కై సీజన్ 3, అబాట్ ఎలిమెంటరీ సీజన్ 2 జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి. లాస్ట్ మ్యాన్ ఫౌండ్ సీజన్ 1, ది ఎల్ వరల్డ్ జనరేషన్ క్యూ సీజన్ 3 జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఆహా

ఐశ్వర్య రాజేశ్ క్యాబ్ డ్రైవర్‌గా నటించిన డ్రైవర్ జమున తెలుగు, తమిళ భాషల్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

జీ 5

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఛత్రీవాలి సినిమా జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బిగ్‌బాస్ ఫేం సన్నీ, దివి వాద్యా నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ జనవరి 20 నుంచే స్ట్రీమింగ్ అవ్వనుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్

మార్తే డమ్ టక్, ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెకీనా సినిమాలు జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News