Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsTata Nexon EV | కార్లు కొనేవాళ్లకు గుడ్ న్యూస్.. నెక్సాన్ ఈవీ ధరలు తగ్గించిన...

Tata Nexon EV | కార్లు కొనేవాళ్లకు గుడ్ న్యూస్.. నెక్సాన్ ఈవీ ధరలు తగ్గించిన టాటా

Tata Nexon EV | ఎలక్ట్రిక్ కార్లను కొనాలని అనుకునేవాళ్లకు గుడ్ న్యూస్. నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరను తగ్గిస్తూ టాటా కంపెనీ నిర్ణయం తీసుకుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 మార్కెట్‌లోకి విడుదలైన నేపథ్యంలో నెక్సాన్ ఈవీ కార్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పోటీ సంస్థల నుంచి కొత్త కార్లు వచ్చిన నేపథ్యంలోనే తమ కార్ల ధరలను తగ్గించడంతో పాటు కొత్త ట్రిమ్‌లను జోడిస్తున్నట్టు టాటా కంపెనీ వెల్లడించింది.

గతంలో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర ( ఎక్స్ షోరూం) రూ.14.99 లక్షల ఉండగా.. దాన్ని రూ.14.49 లక్షలకు తగ్గించింది. హైఎండ్ మోడల్ ధర రూ.19.34 లక్షలు ( ఎక్స్ షోరూం)గా గతంలో ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.18.99 లక్షలకు తగ్గించింది. దీంతో పాటు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రేంజ్‌ను 437 కిలోమీటర్ల నుంచి 453 కిలోమీటర్లకు పెంచనుంది. కొత్త ఈవీ మ్యాక్స్‌లను కొనుగోలు చేసే వారికి ఫిబ్రవరి 15 నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ కార్లు తాజాగా విపణిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నెక్సాన్ ఈవీ కార్ల ధరలను తగ్గించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కారు ప్రారంభ ధర రూ.15.99 లక్షలు ( ఎక్స్ షోరూం) కాగా, గరిష్ఠ ధర రూ.18.99 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. దీని మ్యాక్స్ రేంజ్.. టాటా నెక్సాన్ ఈవీ కంటే మూడు కిలోమీటర్లు అధికంగా ఉంది. అందుకే టాటా నెక్సాన్ తన మ్యాక్స్ రేంజ్‌ను 437 కిలోమీటర్ల నుంచి 453 కిలోమీటర్లకు పెంచనుంది. సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు ఈ రేంజ్‌ను పొందుతారని టాటా కంపెనీ తెలిపింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Maruti Suzuki Jimny | ఈ కారుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. డిమాండ్ చూసి బుకింగ్ అమౌంట్ రెట్టింపు చేసేసిన మారుతి సుజుకీ

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News