Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsNationalKoo vs Twitter | కూ సంస్థకు షాకిచ్చిన ట్విట్టర్.. అకౌంట్ తొలగింపు

Koo vs Twitter | కూ సంస్థకు షాకిచ్చిన ట్విట్టర్.. అకౌంట్ తొలగింపు

Koo vs Twitter | మైక్రోబ్లాగింగ్ సంస్థలకు పోటీగా తీసుకొచ్చిన కూ దేశీ యాప్‌నకు ట్విట్టర్ షాకిచ్చింది. యూజర్ల సందేహాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన @kooeminence అకౌంట్‌ను శుక్రవారం నిలిపివేసింది. అలాగే న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసింది. కూ యాప్‌తో పాటు జర్నలిస్టులు వాళ్ల వార్తలకు సంబంధించిన లింక్‌లను ట్విట్టర్‌లో పంచుకోవడమే కారణమని ట్విట్టర్ సంస్థ తెలిపింది. ఇవి అంత సురక్షితమైనవి కావని వివరించింది.

ట్విట్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై కూ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా తీవ్రంగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఎలన్ మస్క్‌పై మండిపడ్డాడు. దీనికి #ElonIsDestroyingTwitter ట్యాగ్‌ను జత చేశాడు. ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారాన్ని పోస్టు చేయడం డాక్సింగ్ కిందకు రాదని స్పష్టం చేశాడు. మీకు మాత్రమే నచ్చిన విధాలనున రూపొందించడం దారుణమని అసహనం వ్యక్తం చేశాడు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారి ఖాతాలను తొలగించడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవు పలికారు. ఆదిపత్యం కోసమే మస్క్ ఇలా చేస్తున్నాడని.. దీన్ని ఎన్నటికీ సహించకూడదని.. దీనిపై గళమెత్తాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చాడు. తమ కూ మాధమ్యంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పక్షపాత ధోరణి విధానాలు రూపొందించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. పలువురి అకౌంట్లు నిలిపివేయడం, ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలు వివాదాలకు దారితీశాయి. పైగా సెలబ్రెటీలు, జర్నలిస్టులు, ఇతరత్రా ప్రముఖులకు ఇచ్చే వెరిఫికేషన్ బ్లూ టిక్‌పై కూడా ఇటీవల కాలంలో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fire Accident | మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. ప్రమాదమా? కావాలనే నిప్పు పెట్టారా?

Pilot Rohit reddy | ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి.. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేస్తా

Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్‌ కామెంట్స్‌.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News