Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentAtlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

Atlee kumar | పెళ్లయిన దాదాపు పదేళ్లకు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి చాలా సంతోషంగా అందరితో పంచుకున్నాడు. ఈ వార్త తెలిసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో సెలబ్రెటీ కపుల్‌ కూడా పేరెంట్స్‌ కాబోతున్నారు. వాళ్లెవరో కాదు రాజా రాణి, పోలీసోడు, అదిరింది, బిగిల్‌ వంటి డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కుమార్‌ దంపతులు. ఈ విషయాన్ని అట్లీ కుమార్‌ దంపతులు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఈ విషయాన్ని చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు మాకు కావాలంటూ అట్లీ సతీమణి ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అలాగే బేబీ బంప్‌ ఫొటోను షేర్‌ చేసింది. ఇదే విషయాన్ని అట్లీ కుమార్‌ కూడా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. మా కుటుంబం పెద్దది అవుతోంది. త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలంటూ అట్లీ పోస్టు పెట్టాడు. బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్‌ అట్లీ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా అట్లీ, ప్రియ కలుసుకున్నారు. అప్పటికే ప్రియ పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి 2014లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అవుతున్నారు. దీంతో వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News