Home Latest News Image Blur Tool in Whatsapp | ఫొటోలు పంపేందుకు సరికొత్త ఫీచర్.. ఇక ఆ...

Image Blur Tool in Whatsapp | ఫొటోలు పంపేందుకు సరికొత్త ఫీచర్.. ఇక ఆ యాప్‌లతో పనిలేదు

Image Blur Tool in Whatsapp | చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు దిగేస్తుంటారు. వాటిని వాట్సాప్‌లో ఇతరులకు పంపిస్తుంటారు. ఇప్పుడు ఇదంతా చాలా కామన్ అయిపోయింది. అయితే అలా ఫొటోలు దిగినప్పుడు మన పక్కన ఉన్న వ్యక్తులను లేదా వెనుక ఉన్న పేర్లను లేదా సెన్సెటివ్ విషయాలను బ్లర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వేరే ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌లో మనకు అక్కర్లేని దాన్ని క్రాప్ చేయడమో లేదా బ్లర్ చేయడమో చేసి వాట్సాప్‌లో పంపిస్తాం. కానీ వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫొటోను సెండ్ చేసే టైమ్‌లోనే సెన్సెటివ్ పార్ట్‌ను బ్లర్ చేసి పంపియొచ్చు.

ఇమేజ్ బ్లర్ టూల్ అని పిలిచే ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ఫొటోలను సెండ్ చేసే సమయంలోనే ఇమేజ్ బ్లర్ టూల్‌తో అవతలి వ్యక్తి చూడకూడదని అనుకునే సమాచారాన్ని చాలా నీట్‌గా బ్లర్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల చాలా టైమ్ సేవ్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం డెస్క్‌టాప్ బీటా వర్షెన్‌లోనే ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. ఒకవేళ మీరు డెస్క్‌టాప్ వాట్సాప్ అప్లికేషన్ వాడుతున్నట్లయితే మీకు ఈ ఇమేజ్ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి చిన్న చిట్కా ఉంది. అదేంటంటే.. ముందుగా వాట్సాప్‌లో ఏదైనా కాంటాక్ట్ నంబర్‌కు ఇమేజ్ పంపించండి. ఇమేజ్ పంపించేముందు ఎడిటింగ్ పేజిలో బ్లర్ బటన్ ఉందో లేదో గమనించండి. ఎడిటింగ్ పేజిలో ఇమేజ్ బ్లర్ టూల్ కనిపిస్తే.. ఇక దాన్ని వాడటం మొదలుపెట్టండి. ఒకవేళ బ్లర్ టూల్ కనిపించకపోతే.. ఆ ఫీచర్ అందుబాటులోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version