Home Latest News T20 world cup | పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఒక పరుగు తేడాతో...

T20 world cup | పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఒక పరుగు తేడాతో సూపర్‌ విక్టరీ

T20 world cup | టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ప్రపంచకప్‌ విజేతలైన వెస్టిండీస్‌, శ్రీలంక ఇప్పటికే పసికూనలో చేతిలో ఘోరంగా ఓడిపోగా.. ఇప్పుడు పాకిస్థాన్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో ఒక పరుగు తేడాతో జింబాబ్వే విజయం సాధించి పాక్‌ను కంగు తినిపించింది.

తొలి మ్యాచ్‌లో కూడా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చివరి బంతి వరకు ఉత్కంఠ పోరు కొనసాగించింది. చివరకు పాక్‌పై భారత్‌ విజయం సాధించింది. ఇప్పుడు పాకిస్థాన్‌, జింబాబ్వే మధ్య సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. చివరి బంతి వరకు విజయం నువ్వా నేనా అన్నట్లుగా ఊగిసలాడి.. జింబాబ్వేను వరించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ జింబాబ్వే రాణించింది.

Read more: T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

తొలుత బ్యాటింగ్‌ చేసి జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేసింది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో జింబాబ్వే స్వల్ప స్కోరే చేయగలిగింది. మహ్మద్‌ వసీం 4 వికెట్లు, షదాబ్‌ ఖాన్‌ 3 వికెట్లు తీశాడు. 131 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్‌ను జింబాబ్వే బౌలర్‌ సికిందర్‌ రాజా ముచ్చెమటలు పట్టించాడు. జింబాబ్వే బౌలర్లు సమష్టిగా రాణించారు.

పాక్‌ మూలాలున్న ఆల్‌రౌండర్‌ ముచ్చెమటలు పట్టించాడు

పాకిస్థాన్ 13 ఓవర్ల వరకు పటిష్టంగానే కనిపించింది. అప్పటివరకు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 80 పరుగులు చేసింది. అయితే పాక్‌ మూలాలున్న సికిందర్‌ రాజా బౌలింగ్‌తో పరిస్థితి తారుమారైంది. 14వ ఓవర్‌ వేసిన సికిందర్‌.. షాదాబ్‌ ఖాన్‌ను ఔట్‌ చేశాడు. తర్వాతి బంతికే హదర్‌ అలీని కూడా డకౌట్‌ చేయడంతో జింబాబ్వే పై చేయి సాధించింది. మరోవైపు 16 ఓవర్‌లో షాన్‌ మసూద్‌ను ఔట్‌ చేశాడు. ఇదే మ్యాచ్‌లో టర్నంగ్‌ పాయింట్‌. చివర్లో నవాజ్‌ పాక్‌ విజయంపై ఆశలు రెకెత్తించినా.. జింబాబ్వే సమష్టి పోరాటంతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన స్థితిలో షాహిద్‌ ఆఫ్రిదీ రెండో పరుగు తీస్తూ రనౌట్‌ అయ్యాడు. దీంతో ఒక పరుగు తేడాతో జింబాబ్వే విజయం సాధించింది.

Read More : T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

సికిందర్‌ రాజాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన సికిందర్‌ రాజాకు మ్యాన్‌ అఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టంగా మార్చకుంది. గ్రూప్‌ 2 పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు చెరో మూడు పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌, నెదర్లాండ్స్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి.

Follow Us : FacebookTwitter

Read more articles | Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

Exit mobile version