Home Latest News Whatsapp Spam Calls | ఇలా చేస్తే వాట్సాప్‌లో ఇక స్పామ్‌ కాల్స్‌ అస్సలు రావు!

Whatsapp Spam Calls | ఇలా చేస్తే వాట్సాప్‌లో ఇక స్పామ్‌ కాల్స్‌ అస్సలు రావు!

Whatsapp Spam Calls | ఫ్రాడ్‌ కాల్స్‌తో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనలో చాలామంది ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి ఫోన్లతో విసుగెత్తిపోయిన జనాలను సైబర్‌ కేటుగాళ్లు మరింతగా సతాయిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా నార్మల్‌ కాల్స్‌తోనే టార్గెట్‌ చేసిన వాళ్లు.. వాట్సాప్‌లోనూ చిరాకు తెప్పించడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్‌లో మిస్డ్‌ కాల్స్‌ రావడం ఈ మధ్య ఎంత కలకలం సృష్టించిందో చూడనే చూశాం. వాట్సాప్‌లోనూ స్పామ్‌ కాల్స్‌ రావడం చూసిన యాజమాన్యం ఇప్పుడు ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యింది. వెంటనే వాటిని అడ్డుకునేందుకు అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది.

నార్మల్‌ ఫోన్‌ కాల్స్‌లో స్పామ్‌, ప్రకటనలకు సంబంధించిన కాల్స్‌ను అడ్డుకునేందుకు డు నాట్‌ డిస్ట్రబ్‌ (డీఎన్‌డీ) ఎలా ఉందో… వాట్సాప్‌లోనూ ఫ్రాడ్‌ కాల్స్‌ అడ్డుకునేందుకు సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ పేరిట ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఆన్‌ చేసుకుంటే అపరిచిత నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే ఎలాంటి అలర్ట్‌ రాదు. అలాంగే ఫోన్‌ కూడా రింగ్‌ అవ్వదు. డైరెక్ట్‌గా అది వాట్సాప్‌ కాల్‌ లిస్ట్‌లో చేరిపోతుంది. దీంతో స్పామ్‌ కాల్స్‌ బెడద ఏ మాత్రం ఉండదని వాట్సాప్‌ వెల్లడించింది. అపరిచిత నంబర్ల నుంచి కూడా ఏదైనా ముఖ్యమైన కాల్‌ వచ్చి ఉంటే.. కాల్‌ లిస్ట్‌లోని నంబర్‌ చూసుకుని కాల్‌ చేస్తే సరిపోతుంది.

దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

వాట్సాప్‌ యాప్‌లో కుడి వైపు టాప్‌లో ఉన్న మూడు చుక్కల గుర్తును ప్రెస్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లోని ప్రైవసీ విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత అందులోని కాల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ను ఆన్‌ చేయాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Advantage of cycle | సైకిల్ గురించి ఈ విశేషాలు తెలుసా? సైకిల్ వాడితే బీపీ, షుగర్ ను కంట్రోల్ చేయొచ్చా?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

Bill gates Phone | బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడతారో తెలుసా.. ఐ ఫోన్ మాత్రం అస్సలు కాదు!

Exit mobile version