Hardik Pandya | హార్దిక్ పాండ్యాకు మళ్లీ పెళ్లి ఏంటి? భార్యాపిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాడు కదా! సడెన్‌గా ఇంకో పెళ్లి ఏంటి అని అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది నిజమే ! ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంతకీ అమ్మాయి ఎవరని ఆలోచిస్తున్నారా.. ఎవరో కాదండీ. తన భార్య నటాషానే ! అదేంటి వీళ్లకు ఆల్రెడీ పెళ్లయ్యింది కదా! మళ్లీ పెళ్లెందుకు చేసుకుంటున్నారనే కదా డౌట్!! అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సెర్బియా దేశానికి చెందిన నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2020 జనవరి 1వ తేదీన దుబాయిలో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. బంధుమిత్రులను, స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. దీంతో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఎలాంటి హంగు అర్బాటాలు లేకుండా మే 31వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని అనుకుంటే తన కలను కరోనా చెదరగొట్టింది. అందుకే మరోసారి గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని హార్దిక్ పాండ్యా – నటాషా దంపతులు అనుకున్నారు. ఇందుకోసం ప్రేమికుల రోజును సెలెక్ట్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హార్దిక్ పాండ్యా – నటాషా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. నాలుగు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక జరగనుంది. హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
నటాషా విషయానికొస్తే సెర్బియా దేశానికి ఈమె 2013లో వచ్చిన సత్యాగ్రాహ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యాక్షన్ జాక్షన్, ఫుక్రే రిటర్న్స్ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 8వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని దాటేసిన మహమ్మద్ షమీ..
Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి
Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్
IND vs AUS | రఫ్ఫాడించిన రోహిత్.. రెండో రోజు టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం