Home Latest News Fifa World cup 2022 | సెమీస్‌లో చిత్తుగా ఓడిన మొరాకో..ఫైనల్స్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

Fifa World cup 2022 | సెమీస్‌లో చిత్తుగా ఓడిన మొరాకో..ఫైనల్స్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

Fifa World cup 2022 | ఫిఫా వరల్డ్‌కప్ 2022లో సంచలనంగా సెమీస్‌కు చేరిన మొరాకో ( morocco ) జట్టుకు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ( france ) చేతిలో చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది. 2-0 ఆధిపత్యంతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో అర్జెంటీనాతో తలపడనుంది.

సెమీస్ మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ దూకుడు ప్రదర్శించింది. తొలి ఐదు నిమిషాల్లోనే గోల్ చేసింది. మొరాకో డిఫెన్స్‌లోకి వెళ్లిన ఫ్రాన్స్ ఆటగాడు థియో ఫెర్నాండేజ్.. అద్భుతంగా గోల్ చేశాడు. స్కోర్ సమం చేసేందుకు మొరాకో తీవ్రంగా కష్టపడింది. కానీ లాభం లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. సెకండాఫ్‌లో సగానికిపైగా సమయం బంతిని మొరాకో తమ నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ ఫ్రాన్స్ ఆటగాళ్లను దాటుకుని గోల్స్ చేయలేకపోయింది. 79 నిమిషాల వద్ద ఎంబపే నుంచి పాస్ అందుకున్న ఫ్రాన్స్ ఆటగాడు రాండల్ కోలో మౌనీ.. రెండో గోల్ చేశాడు. దీంతో మొరాకో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. గోల్ కోసం చివరిదాకా శ్రమించినా ఒక్క గోల్ చేయలేకపోయింది.

ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో మొరాకో సంచలనం సృష్టించింది. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ వంటి బలమైన జట్లను ఓడించి సెమీస్‌ వరకు చేరుకుంది. సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో నిలిచింది. సెమీస్‌లో ఓడినప్పటికీ మొరాకోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనామక జట్టుగా వరల్డ్ కప్‌లో ఎంట్రీ ఇచ్చినా.. ఉద్ధండ జట్లను ఓడించి సెమీస్‌ వరకు దూసుకొచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఫైనల్‌కు వెళ్లలేకపోయినా కోట్లాది మంది మనసులను గెలుచుకున్నారని ప్రశంసిస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.. ఏడు నెలలు కాకుండానే తనువు చాలించాడు..

Exit mobile version