Home Latest News FIFA World cup 2022 | మెస్సీ మెరుపులు.. సెమీస్‌కు చేరిన అర్జెంటీనా

FIFA World cup 2022 | మెస్సీ మెరుపులు.. సెమీస్‌కు చేరిన అర్జెంటీనా

FIFA World cup 2022 | ఫిఫా వరల్డ్ కప్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ ( lionel messi ) మరోసారి సత్తా చాటాడు. దోహాలోని లుసైల్ స్టేడియంలో జరిగిన రెండో క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ ( netherlands )పై అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. నెదర్లాండ్స్‌ను ఓడించి తాను నాయకత్వం వహిస్తున్న అర్జెంటీనా ( argentina ) జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చాడు.

మ్యాచ్ ఆరంభం నుంచి అర్జెంటీనా ఆధిపత్యం కనబరిచింది తొలి హాఫ్‌లో 53 శాతం సమయం బంతిని తమ వద్దే ఉంచుకుంది. గోల్స్ చేసేందుకు తెగ ప్రయత్నించింది. ఆ సమయంలో మెస్సీ అద్భుతమైన షాట్‌తో ఒక గోల్ సంపాదించాడు. ఫస్ట్ హాఫ్‌లో నెదర్లాండ్స్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో ఫస్ట్ హాఫ్ టైమ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో ఉంది. సెకండాఫ్‌లో నెదర్లాండ్స్‌ చేసిన పొరపాటు వల్ల అర్జెంటీనాకు పెనాల్టీ దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న మెస్సీ.. రెండో గోల్ సాధించాడు. అర్జెంటీనా గెలుపు ఖాయమైందని అనుకునే సమయంలో నెదర్లాండ్స్ కూడా అద్భుతంగా ఆడి రెండు గోల్స్ చేసింది. ఆట ముగిసేసరికి 2-2తో రెండు జట్లు సమంగా ఉన్నాయి. దీంతో రిఫరీ అదనంగా 30 నిమిషాలను ఇచ్చాడు.

కానీ ఆ సమయంలో రెండు జట్లు కూడా గోల్స్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ పెనాల్టీ షూటవుట్‌కు వెళ్లింది. ఇందులో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన అర్జెంటీనా.. 4-3 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అర్జెంటీనా 9 గోల్స్ చేసింది. వాటిలో నాలుగు గోల్స్ మెస్సీనే చేయడం విశేషం.

‌స్ట్ హాఫ్‌లో అర్జెంటీనా రెండు గోల్స్ చేయ‌గా.. ఆ త‌ర్వాత సెకండ్ హాఫ్‌లో నెద‌ర్లాండ్స్ రెండు గోల్స్ చేసి స్కోరును స‌మం చేసింది. ఇక ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ రెండు జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డినా గోల్స్ మాత్రం చేయ‌లేక‌పోయాయి. సూప‌ర్ థ్రిల్లింగ్‌గా సాగిన పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-3 గోల్స్ తేడాతో నెద‌ర్లాండ్స్‌పై విక్ట‌రీ కొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లోకి ప్ర‌వేశించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

FIFA world cup | ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సంచలనం.. బ్రెజిల్‌ను ఓడించిన క్రొయేషియా

Cricket records | ఆరంగేట్రంలోనే అదుర్స్‌ అనిపించిన పాక్‌ బౌలర్‌.. 24 ఏళ్లకే అరుదైన రికార్డు

Exit mobile version