Home Latest News CM KCR | బీఆర్‌ఎస్‌ లక్ష్యం అదేనా..? కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

CM KCR | బీఆర్‌ఎస్‌ లక్ష్యం అదేనా..? కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

CM KCR | బీఆర్‌ఎస్‌ ( BRS ) ఆవిర్భావం సందర్భంగా కేంద్రంపై తెలంగాణ సీఎం నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్త్ను దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా నూతన విధానాలను అమల్లోకి తీసుకొద్దామని అన్నారు. 40 కోట్ల ఎకరాల సాగు భూమి, 70 వేల టీఎంసీల నీటి వనరులున్నా.. రైతుల ధర్నాలు ఇంకెంత కాలం కొనసాగుతాయని ప్రశ్నించారు. ఆకలి ఇండెక్స్‌లో ఎందుకు భారత్‌ ముందుంది.. ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలో పరిస్థితి ఎందుకు మారట్లేదంటూ ప్రశ్నించారు.

రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదన్నారు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలి.. ప్రజా ప్రతినిధులు గెలవాలని అన్నారు. సరిగ్గా ఇదే పరివర్తనం కోసం ఏర్పాటైందే బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొని ఇంత దూరం వచ్చామని, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ చీకట్లను పారదోలేందుకు వెలిగించిన చిరుదీపమే బీఆర్‌ఎస్‌ పార్టీ అని కేసీఆర్‌ వివరించారు.

యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమైపోతుందని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచే ఇది ప్రారంభం కావాలన్నారు.

దేశానికి ఆ రెండే కీలకం

దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని కేసీఆర్ అన్నారు. దేశ పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి ఏర్పడిందన్న కేసీఆర్‌.. ఇప్పుడు దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరం అన్నారు. జాతీయ స్థాయిలో కొత్త పర్యావరణ విధానం అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత కోసం కొత్త విధానం అమలు చేయాలన్నారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామని, రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామని చెప్పారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Twist in Women Kidnap Case | ఆధిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. తండ్రికి ఫోన్‌ చేసిన యువతి..

Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా మెట్రో

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

Exit mobile version