Home Latest News FIFA World cup 2022 | చెదిరిన రొనాల్డో కల.. తొలిసారి సెమీస్‌కు చేరిన మొరాకో

FIFA World cup 2022 | చెదిరిన రొనాల్డో కల.. తొలిసారి సెమీస్‌కు చేరిన మొరాకో

FIFA World cup 2022 | ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ( Crisiano Ronaldo )కు నిరాశే మిగిలింది. కెరీర్ చివరి ఫిఫా వరల్డ్ కప్‌లో గెలవాలని ఆశపడ్డ రొనాల్డో కల చెదిరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో అనామక జట్టు మొరాకో చేతిలో ఓడిపోయిన పోర్చుగల్ జట్టు ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో గెలిచిన మొరాకో సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫిఫా చరిత్రలో సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో ( Morocco ) నిలిచింది. మొరాకో కంటే ముందు 1990లో కామెరూన్, 2002లో సెనెగల్, 2010లో ఘనా జట్టు క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి.

పోర్చుగల్, మొరాకో జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్‌లో రెండు జట్లు కూడా పోటాపోటీగా ఆడాయి. పోర్చుగల్ జట్టు ఎక్కువ శాతం బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నాయి. అయితే ఫినిషింగ్ లోపం కారణంగా గోల్స్ చేయలేకపోయింది. సెకండాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రొనాల్డో జట్టు సభ్యులకు స్ఫూర్తి నింపాడు. బంతి దొరకడం ఆలస్యం గోల్ పోస్టు వైపు దూసుకెళ్లాడు.అయినప్పటికీ పోర్చుగల్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అయితే సమయం కోసం చూసి మొరాకో జట్టు.. అదును చూసి గోల్ చేసింది. యూసుఫ్ ఎన్‌నెస్రీ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మొరాకో సెమీస్‌కు చేరింది. అయితే తన కెరీర్‌లో చివరి ఫిఫా వరల్డ్ కప్‌లో ఎలాగైనా కప్ కొట్టాలన్నా తన కల చెదిరిపోవడంతో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sania – shoaib malik divorce rumours | సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి ఆమే కారణమా? షోయబ్ తాజా వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?

Cricket records | ఆరంగేట్రంలోనే అదుర్స్‌ అనిపించిన పాక్‌ బౌలర్‌.. 24 ఏళ్లకే అరుదైన రికార్డు

Exit mobile version