Home Latest News Sania – shoaib malik divorce rumours | సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి...

Sania – shoaib malik divorce rumours | సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి ఆమే కారణమా? షోయబ్ తాజా వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?

Sania – shoaib malik divorce rumours | భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారా? 2010 ఒక్కటైన ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా షోయబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

సానియా, షోయబ్ లకు 2010లో ఘనంగా వివాహం జరిగింది. వీరికి ఇజాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుందని సోషల్ మీడియాలో గుప్పుమంది. అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతోనే విడాకులు ఆలస్యమవుతున్నాయని వినిపించింది. ఈలోపే ముందు చేసుకున్న ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. పాకిస్థాన్ కు చెందిన ఉర్దూఫ్లిక్స్ ఓటీటీ కోసం ది మీర్జా మాలిక్ అనే రియాలిటీ షో కోసం ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. దీనికోసమే ఇప్పుడు ఒకేస్టేజీ మీద కనిపించారు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ రియాలిటీ టాక్ షోలో కనిపించడంతో వీళ్లు నిజంగానే విడిపోతున్నారా.. అన్ని రూమర్సేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే షోయబ్ మాలిక్ మాత్రం విడాకుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

అది మా వ్యక్తిగత విషయం దాన్ని మాకు వదిలేయండి అంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాదు.. విడాకులకు దరఖాస్తు చేశారా లేదా అనే ప్రశ్నకు నేనుగానీ, నా భార్యగానీ ఎక్కడా సమాధానం ఇవ్వలేదని మీడియా ముందే తేల్చి చెప్పాడు. దీనిని ఇక్కడితో వదిలేయాలని కోరాడు. ఈ అంశంపై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ విజ్ఞప్తి చేశాడు. సానియా మీర్జా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వబోదన్నాడు.

కానీ వీరిద్దరి మధ్య విడాకుల అంశం ఇప్పటికే కొలిక్కి వచ్చిందని సమాచారం. వివిధ షోల కోసం ఇప్పటికే కమిట్మెంట్స్ ఇచ్చిన నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా సైలెంట్ గా ఉంటున్నారని అనుకుంటున్నారు. అవి క్లియర్ కాగానే వీరి మధ్య బంధానికి స్వస్తి చెబుతారని విశ్వసనీయ సమాచారం. కాగా, వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి షోయబ్ మాలిక్ ప్రవర్తనే కారణమట. పాక్ కు చెందిన యూట్యూబర్, నటి అయేషా ఓమర్ తో షోయబ్ ప్రేమలో ఉన్నాడని, అందుకే సానియాతో విడాకులకు సిద్ధపడ్డాడని వినిపిస్తోంది. అయేషా మాత్రం అలాంటిదేం లేదని, ఇద్దరం కేవలం స్నేహితులమేనంటూ కొట్టిపారేసింది. సానియాతో షోయబ్ సంతోషంగా ఉన్నాడని ప్రకటించేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Selfie tragedy | సెల్ఫీ పిచ్చితో లోయలో పడిన వధూవరులు.. ఆగిపోయిన పెళ్లి

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Supreme court | ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినందుకు 75 లక్షలు ఇప్పించాలని యువకుడి పిటిషన్.. షాకింగ్ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

Exit mobile version