Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsWeather Report | మరో మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిందే.. వాతావరణ శాఖ హెచ్చరిక

Weather Report | మరో మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిందే.. వాతావరణ శాఖ హెచ్చరిక

Weather Report | ఉత్తరాది నుంచి తెలంగాణకు వీస్తున్న చలిగాలుల ప్రభావంతో మరో మూడు రోజులు తెలంగాణలో చలితీవ్రత ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

ఉత్తర తెలంగాణపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, విదర్భా నుంచి చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ప్రతి ఏడాది జరిగేదే అని అయినా.. ఈ సారి ఆలస్యమైనట్లు వెల్లడించింది. ప్రతి ఏటా డిసెంబర్‌ మూడో వారంలో చలిగాలులు తీవ్రంగా వీస్తాయిని అయితే ఇప్పుడు కొంత ఆలస్యమైందని తెలింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత క్రమంగా ఉష్ణగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలోని పలు జిల్లాలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. ఆదిలాబాద్‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదకు, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెల్లవారుజామును పొగమంచు తీవ్రంగా ఉంటుందని తెలిపింది. మరోవైపు వృద్ధులు, చిన్న పిల్లలు, అస్తమా బాధితులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. ఆదివారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత, మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా16.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Weather Effect | పంజా విసురుతున్న చలి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Fog Effect | పొగమంచు ఎఫెక్ట్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News