Thursday, March 28, 2024
- Advertisment -
HomeNewsInternationalUS President Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో భారతీయుడు.. ఆయన బ్యాక్‌గ్రౌండ్...

US President Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో భారతీయుడు.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

US President Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నిలబడ్డారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నుంచి తాను కూడా పోటీకి సిద్ధంగానే ఉన్నానని వివేక్ రామస్వామి ప్రకటించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ గురించి వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని వివేక్ రామస్వామి తెలిపారు. ఇది రాజకీయం మాత్రమే కాదని.. అమెరికా సంస్కృతిని కాపాడే ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆదర్శాలను పునరుద్ధరించడంలో పాటుపడతానని తెలిపారు. అలాగే చైనా వంటి దేశం నుంచి అమెరికాకు ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు విదేశీ విధానాలను మార్చాలని సూచించారు. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా అతిక్రమిస్తోందని ఆరోపించారు. యూఎస్ గగనతలంలో కనిపించింది రష్యా బెలూన్ అయితే వెంటనే పేల్చేసేవాళ్లమని.. చైనాది కాబట్టి ఆ పనిచేయలేకపోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక జీవనంలో భాగంగా చైనాపై ఎక్కువగా ఆధారపడటమే దీనికి కారణమని వివరించారు. అందుకే చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని అభిప్రాయపడ్డారు.

వివేక్‌ రామస్వామి 1985 ఆగస్టులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించారు. ఓహియోలోని జనరల్‌ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పనిచేశారు. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థను ప్రారంభించారు. ఇది అనేక వ్యాధులకు మందులను తయారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఆ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. రోయివాంట్‌తో పాటు మరికొన్ని హెల్త్‌కేర్, టెక్నాలజీ కంపెనీలను వివేక్ రామస్వామి స్థాపించారు. 2022లో స్ట్రయివ్ అసెట్ మెనేజ్‌మెంట్ సంస్థను ఆయన ప్రారంభించారు. 2016 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. వివేక్ రామస్వామి ఆస్తులు 600 మిలియన్ డాలర్లుగా ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News