Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalTriplate Sisters | ఒక్కడినే ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. లెక్కలు వేసి.. రోజులు...

Triplate Sisters | ఒక్కడినే ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. లెక్కలు వేసి.. రోజులు పంచుకుని మరీ కాపురం

Triplate Sisters | అవును మీరు విన్నది నిజమే ! ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక్కడినే పెళ్లి చేసుకున్నారు. అది కూడా లవ్ మ్యారేజి. పెళ్లంటే ఏదో జోష్‌లో చేసుకున్నారు సరే.. కాపురం చేసేటప్పుడు కలహాలు వస్తాయి కదా అని సందేహిస్తున్నారు కదూ.. అలాంటి అనుమానం ఏమీ అక్కర్లేదు. దీనిపై ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఫుల్ క్లారిటీతో ఉన్నారు.

భవిష్యత్తులో పొరపచ్చాలు రావద్దని పెళ్లికి ముందే ప్రేమించిన వ్యక్తితో కొంతకాలం ఒకే ఇంట్లో గడిపారు. అతనితో ఏడాదిపాటు సహజీవనం చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చారు. పెళ్లి తర్వాత సంసారం ఎలా చేయాలో ఒక షెడ్యూల్ వేసుకున్నారు. భర్తతో సంతోషంగా ఎలా గడపాలో ప్లాన్ చేసుకున్నారు. ఇది ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు వాళ్ల ప్రియుడికి కూడా నచ్చడంతో పెళ్లి చేసుకుని ఆ నలుగురు ఒక్కటయ్యారు. ఈ వింత సంఘటన కెన్యాలో జరిగింది.

రూపం ఒక్కటే.. అభిరుచులు ఒక్కటే.. ప్రేమ కూడా ఒక్కటే

కెన్యాకు చెందిన కేట్, ఈవ్, మేరీ ఐడెంటికల్ ట్రిప్లెట్స్. ఒకేరూపంలో ఉండే కవల పిల్లలు. చూడ్డానికే కాదు అభిరుచుల పరంగా కూడా వీళ్లు ముగ్గురు ఒకేలా ఉంటారు. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, అలవాట్లు ఒక్కటే. అంతెందుకు వీళ్లు చేసే పని కూడా ఒక్కటే. ముగ్గురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు.. యూట్యూబర్స్. ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యారు. ముగ్గరు కూడా గాస్పెల్ మ్యూజిక్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్టీవో అనే బిజినెస్‌మ్యాన్‌తో కేట్‌కు పరిచయమైంది. వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత కేట్ తన ప్రేమ విషయం మిగిలిన ఇద్దరు చెల్లెళ్లకు చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. వాళ్లకు కూడా స్టీవో తెగ నచ్చేశాడు. అప్పుడే స్టీవోకు అస్సలు విషయం అర్థమైంది. తాను కేట్ ఒక్కదాన్నే కాదు మిగిలిన ఇద్దరినీ కూడా చేసుకోవాల్సి ఉంటుందని. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా స్టీవో నచ్చాడని చెప్పడంతో మొదట షాకయ్యాడు. తర్వాత తేరుకుని కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత ముగ్గురి ప్రేమకు ఓకే చెప్పేశాడు. అప్పట్నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్టీవో కలిసి తిరగడం.. బయటకు వెళ్లడం చేశారు.

పెళ్లికి ముందే ట్రయల్

ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోవడం అంటే వినడానికి భలేగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీకల్‌గా చాలా సమస్యలు ఉంటాయి. తనపైనే ఎక్కువ ప్రేమిస్తున్నావంటే.. తనతోనే ఎక్కువ గడుపుతున్నావని ముగ్గురితో పేచీ పడాల్సి వస్తుంది. దీనివల్ల ఎవరితోనూ అన్యోన్యంగా గడపలేని పరిస్థితి ఎదురుకావచ్చు. అందుకే పెళ్లి తర్వాత ఎలాంటి గొడవలు రావద్దని కేట్, ఈవ్, మేరీ ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నారు. స్టీవో కలిసి కొద్దిరోజులు సహజీవనం చేయాలని ఫిక్సయ్యారు. అలా ఏడాదిపాటు వీళ్ల సహజీవనం సాఫీగా సాగింది. ఇన్నిరోజుల్లో వీళ్ల మధ్య ఎలాంటి గొడవలు, తగాదాలు రాలేదట. అందుకే పెళ్లి తర్వాత కూడా ఇలాగే అన్యోన్యంగా ఉండొచ్చని ఫిక్సయ్యారు. రీసెంట్‌గా పెళ్లి చేసుకుని ఆ నలుగురు కాస్త ఒక్కటయ్యారు.

ఇదీ టైమ్ టేబుల్

ఎంతైనా ముగ్గురు అక్కాచెల్లెళ్లు అయినప్పటికీ.. అక్కాచెల్లెళ్లు అయినప్పటికీ తన భర్త తనతోనే ఎక్కువ సమయం గడపాలని ఆశపడటం సహజమే. కాబట్టి పెళ్లి తర్వాత స్టీవోతో సన్నిహితంగా గడపడం కోసం ముందుగానే వీళ్లు ఒక టైమ్‌టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారు. దీని ప్రకారం స్టీవోతో సంసారం కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక షెడ్యూల్ వేసుకున్నారు. దాని ప్రకారం సోమవారం మేరీతో, మంగళవారం కేట్‌తో, బుధవారం ఈవ్‌తో స్టీవ్ గడుపుతాడు. మిగతా నాలుగు రోజులు కూడా ఆ నలుగురు కలిసి మెలిసి అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు. చిన్నతనం నుంచి ఎంతో అన్యోన్యంగా పెరిగిన ఈ కవల అక్కాచెల్లెళ్లు.. పెళ్లి తర్వాత కూడా దూరమవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ముగ్గురు అక్కాచెల్లెళ్లు చూడ్డానికి ఒకేలా ఉండటమే కాదు.. వాళ్ల ఆలోచనలు కూడా ఒకటే కావడంతో పెళ్లి తర్వాత హాయిగా ఉంటామని స్టీవో చెబుతున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News