Home Latest News Vande Bharat | సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఇక చాలా స్పీడ్‌గా వెళ్లొచ్చు.. ఇదీ వందే...

Vande Bharat | సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఇక చాలా స్పీడ్‌గా వెళ్లొచ్చు.. ఇదీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌

Vande Bharat | తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్‌ రైలు వచ్చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో రైలును తీసుకొస్తుంది. సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. దీన్ని ఈ నెల 8న ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో ప్రారంభించనున్నారు. వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ట్రైన్‌ నంబర్‌, టైమింగ్స్‌కి సంబంధించిన వివరాలను తాజాగా దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.

సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వెళ్లే రైలుకు 20701 నంబర్‌ను కేటాయించారు. తిరుగు ప్రయాణంలో 20702 నంబర్‌ను అలాట్‌ చేశారు.

సాధారణ రైళ్లలో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లేందుకు దాదాపు 11 నుంచి 12 గంటల మధ్య సమయం పడుతుంది. కానీ వందే భారత్‌ రైలులో 9 గంటల్లోనే వెళ్లిపోవచ్చు. అంటే దాదాపు 3 గంటల సమయం మిగులుతుంది.

ఈ వందే భారత్‌ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతుంది. అక్కడి నుంచి నల్గొండ (7: 19 ), గుంటూరు (9:45), ఒంగోలు (11:09), నెల్లూరు (12:29) మీదుగా మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయల్దేరి నెల్లూరు (5:20), ఒంగోలు (6:30), గుంటూరు (7:45), నల్గొండ (10:10) మీదుగా రాత్రి 11:45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు వందేభారత్‌ రైలు సికింద్రాబాద్‌ – తిరుపతి రూట్‌లో అందుబాటులో ఉండనుంది. అయితే ఇంతవరకు ఈ ట్రైన్‌ టికెట్‌ ఛార్జీలను రైల్వే శాఖ ప్రకటించలేదు. తొందరలోనే వీటి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా ఓటమి

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Exit mobile version