Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalUSA Visa | భారతీయ టెకీలకు గుడ్ న్యూస్.. వీసా నిబంధనల్లో భారీ మార్పు తీసుకొచ్చిన...

USA Visa | భారతీయ టెకీలకు గుడ్ న్యూస్.. వీసా నిబంధనల్లో భారీ మార్పు తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం

USA Visa | యూఎస్‌లో నివసిస్తున్న టెకీలకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. H1B, L1 వీసాల రెన్యువల్ కోసం ఇకపై సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికా వీడాల్సిన అవసరం లేకుండానే వీసా రెన్యువల్ చేసుకోవచ్చని తెలపింది. ఈ మేరకు డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరిలోపు ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ విధానంతో అమెరికాలోని వేలాది మంది భారతీయ టెకీలకు ఊరట లభించనుంది.

2004 వరకు హెచ్1బీ వీసాతో పాటు కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల గడువును పునరుద్ధించుకునేందుకు లేదా స్టాంపింగ్ కోసం అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ఈ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. దీంతో యూఎస్‌లో వీసా రీస్టాంపింగ్‌కు అనుమతించడం లేదు. దీంతో హెచ్1బీ, ఎల్1 వీసాలు కలిగిన వాళ్లు వీసా స్టాంపింగ్, రెన్యువల్ కోసం స్వదేశాలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత దేశానికి వెళ్లి అక్కడ వీసా రెన్యువల్ చేసుకుని అమెరికాకు రావాల్సి వచ్చింది. ఇది చాలా ప్రయాసతో కూడిన పని కావడం.. పైగా కొన్నిసార్లు ఈ ప్రక్రియ పూర్తవడానికి నెలల సమయం పట్టడంతో వీసాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అమెరికా ప్రభుత్వం డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ ఏడాది చివరిలోపు అమలుచేయాలని చూస్తోంది. దీనివల్ల వేలాది మంది భారతీయులు లబ్ధి పొందనున్నారు

లేఆఫ్స్ కారణంగా జాబ్ కోల్పోయిన భారతీయ నిపుణులు మళ్లీ ఉద్యోగాలు వెతుక్కునేందుకు వీలుగా హెచ్‌-1బీ వీసా అదనపు గడువు (గ్రేస్‌ పిరియడ్‌)ను 60 రోజుల నుంచి సంవత్సరానికి పెంచాలనే డిమాండ్ బలంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ ఫర్ ఇండియా, గిట్ ప్రో సంస్థలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసి నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం హెచ్‌-1బీ వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల్లోగా కొత్త ఉద్యోగం సంపాదించలేకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. ఈ గడువును ఏడాదికి లేదా కనీసం ఆరు నెలలకు పెంచాలని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, గిట్‌ ప్రో సంస్థలు బైడెన్‌ను కోరాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral news | భార్యను పెట్రోల్‌ బంక్‌ దగ్గర వదిలేసి.. పరాయి వ్యక్తి భార్యను బైక్‌పై ఎక్కించుకెళ్లిన భర్త

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News