Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalUS visa interview | అమెరికా వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. వీసా కోసం ఇంటర్వ్యూలు అక్కర్లేదు...

US visa interview | అమెరికా వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. వీసా కోసం ఇంటర్వ్యూలు అక్కర్లేదు !!

US visa interview | అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌ ! విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఇచ్చే వలసేతర వీసాల జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ నుంచి దరఖాస్తుదారులకు ఇస్తున్న మినహాయింపును మరో ఏడాది పొడిగిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి సారి వీసా తీసుకునేవారికే కాకుండా.. గడువు తేదీ ముగిసిన వీసాను రెన్యువల్ చేసేందుకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇంతకుముందు అమెరికాలో ఏ వీసా జారీకైనా పర్సనల్‌ ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉండేది. ఆ ఇంటర్వ్యూలో ఎంపికైతేనే వీసా వచ్చేది. కానీ కరోనా ఉధృతి కారణంగా ఈ ఇంటర్వ్యూ విధానాన్ని పక్కనబెట్టింది. అయితే చైనా సహా పలు దేశాల్లో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇంటర్వ్యూలను పక్కనబెట్టింది. విదేశీ విద్యార్థులు, టెంపరరీ ఎంప్లాయీస్‌ అమెరికాకు రావడం వల్ల తమ దేశానికి జరుగుతున్న లాభాన్ని గుర్తించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు US విదేశీ వ్యవహారాల శాఖపేర్కొంది. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొత్తగా లేదా రెన్యువల్‌ వీసా దరఖాస్తుదారుల్లో ఎవరిని ఇంటర్వ్యూలకు పిలవాలో నిర్ణయించే అధికారం సంబంధిత కాన్సులర్‌ అధికారులకు అప్పగించినట్టు వెల్లడించింది.

ఇంటర్వ్యూ మినహాయింపు ఎవరికి వర్తిస్తుందంటే..

✈️ టెంపరరీ అగ్రికల్చర్‌ అండ్‌ నాన్‌ అగ్రికల్చర్‌ వర్కర్స్‌ ( H-2 వీసాలు )

✈️ స్టూడెంట్‌ వీసాలు ( F&M వీసాలు )

✈️ అకడమిక్‌ ఎక్సేంజి విజిటర్స్‌ ( అకడమిక్‌ j వీసాలు )

✈️ ప్రత్యేక వృత్తి నిపుణులు (H-1B వీసాలు )

✈️ ట్రైనీ అండ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విజిటర్స్‌ ( H3 వీసాలు )

✈️ ట్రాన్స్‌ఫర్‌ మీద ఇతర దేశాలకు వెళ్లేవారు ( L వీసాలు)

✈️ సైన్స్‌, ఎడ్యుకేషన్‌, ఆర్ట్స్‌, అథ్లెట్స, మోషన్‌ పిక్చర్స్‌, టెలివిజన్‌ ఇండస్ట్రీ విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారు ( O వీసాలు )

✈️ అథ్లెట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం (Q వీసాలు )

Follow Us : FacebookTwitter

Read More Articles |

Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర భగ్నం

Bomb cyclone | క్రిస్మస్ వేళ అంధకారంలో అమెరికా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

Python massage | కొండ చిలువతో మసాజ్ చేపించుకోవాలనుందా.. అయితే అక్కడికి వెళ్లాల్సిందే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News