Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest Newsviral news | ఎన్నికల్లో ఓడిన కోపం మామ తోటపై తీర్చుకుంది.. యువకుడిలో గర్భాశయం.. మహిళ...

viral news | ఎన్నికల్లో ఓడిన కోపం మామ తోటపై తీర్చుకుంది.. యువకుడిలో గర్భాశయం.. మహిళ కంట్లోంచి 200 రాళ్లు..

Viral news | ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. రోటీన్‌కు భిన్నంగా జరిగే ఆ ఘటనలు.. సంఘటనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. అలా బయటపడిన చిత్ర విచిత్ర ఘటనలే ఇవి. మామ చేతిలో ఓడిన కోపంతో.. ఆయన తోటను ధ్వంసం చేసింది ఓ కోడలు. మరోవైపు యువకుడిలో గర్భాశయం, అండాశయం చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఇంకో ఘటనలో మహిళ కంట్లోంచి నీళ్లకు బదులు రాళ్లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏంటనే వివరాలు తెలుసుకోవడానికి ఓసారి లుక్కేయండి మరి..

మామపై ఓడిన కోపం ఆయన తోటపై చూపించింది..

పంచాయతీ సభ్యుడిగా ఓడినందుకు ఓ మహిళ తన మామకు చెందిన బొప్పాయి తోటను ధ్వంసం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీలో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మామ రాంభౌ, కోడలు సన్ బాయి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రాంబౌ విజయం సాధించగా.. సన్ బాయి ఓటమి పాలైంది. దీంతో అర్ధరాత్రి లేచి మామకు చెందిన బొప్పాయి తోటలో 350 బొప్పాయి చెట్లను నరికేసింది. ఉదయం రాంబౌ లేచి చూసే సరికి తోటంతా ధ్వంసం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో తన కోడలు సన్ బాయి తోటను ధ్వంసం తెలిసిందని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమిని భరించలేకే అలా ధ్వంసం చేసి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

కర్ణాటక మహిళ కంట్లోంచి వస్తున్న రాళ్లు

కర్ణాటకకు చెందిన ఓ మహిళ కంట్లోంచి రాళ్లు వస్తూనే ఉన్నాయి. వారం రోజుల్లో దాదాపు 200 రాళ్లు కంటిలోంచి బయటపడ్డాయి. మైసూరుకు సమీపంలోని బెంకిపురా గ్రామానికి చెందిన విజయ అనే మహిళ కంట్లోంచి ఇలా రాళ్లు వస్తుండటం స్థానికంగా సంచలనంగా మారింది. కాగా, వైద్యులు ఆమెను పరీక్షించి కంటిలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. కొద్దిరోజులుగా తలనొప్పి వస్తుందని, గత వారం నుంచి కంట్లో నుంచి రాళ్లు వస్తున్నాయని బాధితురాలు తెలిపింది.

యువకుడిలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు..

జార్ఖండ్‌లో ఓ యువకుడిని పరీక్షించిన వైద్యులు షాక్ అయ్యారు. కొద్దిరోజులుగా గొడ్డా జిల్లాకు చెందిన 22 ఏండ్ల యువకుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల వైద్యులను సంప్రదించాడు. వైద్యులు స్కానింగ్ చేసి అతని పురుషాంగం వద్ద హెర్నియాతో పాటు ఒక వృషణం లేదని గుర్తించారు. హెర్నియాను తొలగించేందుకు సర్జరీ చేస్తుండగా.. అతడి శరీరంలో గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్ ట్యూబ్ ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News