Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsInternationalBomb cyclone | క్రిస్మస్ వేళ అంధకారంలో అమెరికా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

Bomb cyclone | క్రిస్మస్ వేళ అంధకారంలో అమెరికా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

Bomb cyclone | టైమ్ టు న్యూస్, వాషింగ్టన్ : క్రిస్మస్ వేళ అగ్రరాజ్యం అమెరికా ( America )ను మంచు తుఫాను ( winter storm ) వణికిస్తుంది. బాంబ్ సైక్లోన్ కారణంగా కనివినీ ఎరుగని రీతిలో మంచు కురుస్తుండటంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని దాదాపు సగం రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 48 డిగ్రీలకు పడిపోయాయి. న్యూయార్క్, వాషింగ్టన్, లాజ్ ఏంజెలిస్, షికాగో, డల్లాస్, లాస్ వేగాస్, అట్లాంటా, బోస్టన్ సహా పలు నగరాల్లో భారీగా మంచు కురుస్తోంది. కెనడాలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.

బాంబ్ సైక్లోన్ కారణంగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనెక్టికట్, నార్త్ కరోలినా సహా దక్షిణ, మధ్య పశ్చిమ, తూర్పు తీర ప్రాంతాల్లో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల వారు అంధకారంలోనే ఉండాల్సి వచ్చింది. ఈ విపత్తు కారణంగా అమెరికాలోని 60 శాతానికి ( 20 కోట్ల మందికి) పైగా జనాలు ప్రభావితమవుతున్నారు. మంచు తుఫాను కారణంగా శుక్రవారం ఒక్కరోజే 5 వేల విమానాలు రద్దు చేశారు. మరో 7600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. హైవేల మీద మంచు పేరుకోవడంతో రహదారులను మూసివేశారు. దీంతో క్రిస్మస్ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

తుపాను ప్రభావంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బాంబ్ సైక్లోన్ కారణంగా ఒహైయోలో 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. తుపాను బీభత్సం సృష్టిస్తుండటంతో ప్రజలు ఇళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఒహైయో గవర్నర్ ఆదేశించారు. న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాంబ్ సైక్లోన్ మరింత బలపడే అవకాశం ఉందని ఆక్యూవెదర్ సంస్థ ప్రకటించింంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala Satyanaraya | మహాప్రస్థానంలో ముగిసిన కైకాల అంత్యక్రియలు

Corona cases | చైనా తరహాలో భారత్‌లో కరోనా విజృంభిస్తుందా.. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Dubai lottery | దుబాయిలో రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడు.. డ్రైవర్‌గా వెళ్లి కోటీశ్వరుడయ్యాడు

AP CM Jagan | ఏపీ సీఎం జగన్‌కు కోపమొచ్చిందా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అంతలా మాటలన్నాడు!

Hyderabad flats | హైదరాబాద్‌లో రూ.13 లక్షలకే సింగిల్ బెడ్‌రూం.. HMDA మరో అవకాశం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News