Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLatest NewsNirmala Sitharaman | ఆ మాత్రం తెలియదా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్

Nirmala Sitharaman | ఆ మాత్రం తెలియదా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్

Nirmala Sitharaman | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెటైర్లు వేశారు. తెలంగాణలోని ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలియదా అంటూ విమర్శించారు. అమృతకాల బడ్జెట్‌పై దూరదర్శన్ న్యూస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరాలన్న లక్ష్యంపై జోకులు వేయొద్దని కోరారు. రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా అంటూ సీఎం కేసీఆర్‌ను పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మాపై విమర్శలు చేస్తున్నారు సరే మీ సంగతేంటి? అని సీఎం కేసీఆర్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నిలదీశారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. అయినప్పటికీ ఆయా జిల్లాలకే మెడికల్ కాలేజీలు కావాలని ప్రతిపాదనలు పెట్టారని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ బయటపెట్టారు. తెలంగాణలో ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మాత్రం కేసీఆర్‌కు తెలియదా అని సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి డేటా సరిగ్గా ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని నిలదీశారు. నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nikki Yadav | ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలో యువతి హత్య.. కారులో హత్య చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన బాయ్‌ఫ్రెండ్!

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News