Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsUnion Budget 2023 | బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్‌ హైలెట్స్ ఇవే..

Union Budget 2023 | బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్‌ హైలెట్స్ ఇవే..

Union Budget 2023 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఐదోసారి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె ప్రసంగిస్తున్నారు. నిర్మల ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలివే..

పార్లమెంట్‌లో వరుసగా ఐదోసారి బడ్జెట్‌ ప్రేవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌

దేశం వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతోంది

భారత్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.

ప్రపంచ సవాళ్లను భారత్‌ ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఎదుర్కొని నిలబడింది.

జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్‌ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించింది.

భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.

దేశంలో గత తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది.

అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది.

భారత్‌లో డిజిటల్‌ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి.

ఈపీఎఫ్‌ఓలో సభ్యుల సంఖ్య రెట్టింపు అయింది.

సప్తరుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చాం.

రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చాం.

గ్రీన్‌ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది.

పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు తీసుకొస్తాం.

వ్యవసాయం రంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళిక

రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని మరింత పెంచుతున్నాం

వ్వవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం

క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రాంకు రూ.2వేల కోట్ల కేటాయింపులు

మత్స్యకారుల అభివృద్ధి కోసం భారీగా నిధుల కేటాయింపులు

వ్యవసాయం కోసం డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు

వ్యవసాయం కోసం రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సదుపాయం

వ్వవసాయ స్టార్టప్‌లకు చేయుత ఇస్తాం..

81 లక్షల సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపులకు ప్రోత్సాహకాలు .. పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం..

మహిళల కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తాం

సిరిధాన్యాల ఎగుమతిలో భారత్‌ది అగ్రస్థానం

మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా ప్రయత్నాలు.

ఉద్యాన పంటలకు చేయూత

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగిస్తాం

దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు

వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి

శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహకం

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు

ఎస్సీ, ఎస్టీ ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన

ప్రైవేటు, ప్రభుత్వ పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్స్‌ ఏర్పాటు

రైల్వేలకు రూ. 2.04 లక్షల కోట్లు.. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం

ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 15 వేల కోట్లు

ఏకలవ్య పాఠశాలల్లో భారీగా ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం.

యువత కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు

పీఎం ఆవాస్‌ యోజనకు 79 వేల కోట్ల కేటాయింపులు

ఏకలవ్య పాఠశాలల్లో 38,500 ఉపాధ్యాయుల నియామకం

కరువు ప్రాంత రైతుల కోసం రూ. 5,300 కోట్లు

గిరిజన మిషన్‌ కోసం రూ.10 వేల కోట్లు

అర్బన్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌ కింద ఏడాదికి రూ. 10 వేల కోట్లు

రాష్ట్రాలకు 13.7 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు

5జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్స్‌ ఏర్పాటు

వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు

రూ. 75 వేల కోట్లతో మౌలిక సదుపాయాల ఏర్పాటు

మత్స్య శాఖకు రూ. 6వేల కోట్ల నిధులు

రూ. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల పంపిణీ

పలు వస్తువులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు, చిమ్నీల ధరలు

భారీగా తగ్గనున్న టీవీలు, మొబైల్‌ ధరలు

టీవీ ప్యానళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు

లిథియం బ్యాటరీలపై కస్టమ్స్‌ డ్యూటీ 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు

మొబైల్‌ విడిభాగాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

గోల్డ్‌, సిల్వర్‌, కస్టమ్స్‌ డ్యూటీ పెంపు.. పెరగనున్న ధరలు..

తగ్గనున్న డైమండ్స్‌ ధరలు

పెరగనున్న బ్రాండెడ్‌ బట్టల ధరలు.. సిగరెట్‌ ధరలు

వేతన జీవులకు ఊరట.. రూ. 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

7 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ట్యాక్స్‌ లేదు..

7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్నులు

7 లక్షల నుంచి 9 లక్షల వరకు 5 శాతం పన్ను

9 లక్షల ఆధాయం ఉన్నవాళ్లు 45 వేల ట్యాక్స్‌ పే చేస్తే సరిపోతుంది..

12 లక్షల నుంచి 15 లక్షల వరకు 15 శాతం పన్ను

15 లక్షలు దాటితే 30 శాతం పన్నులు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Union Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..

Union Budget 2023 | కేంద్ర బడ్జెట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Droupadi Murmu | ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా ఇండియా తయారైంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Fire Accident | అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News