Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLatest NewsFire Accident | అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

Fire Accident | అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

Fire Accident | ఝార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ధన్‌బాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

మంటలు అంటుకున్న అపార్ట్‌మెంట్‌లో 13 అంతస్తులున్నాయి. ఇందులో మొత్తం 400 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రెండో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా అపార్ట్‌మెంట్‌ అంతటా వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News