Home Latest News TS Gurukula Exam | గురుకుల విద్యాలయాల్లో 9వేలకు పైగా పోస్టులు.. పరీక్ష తేదీలు ప్రకటించిన...

TS Gurukula Exam | గురుకుల విద్యాలయాల్లో 9వేలకు పైగా పోస్టులు.. పరీక్ష తేదీలు ప్రకటించిన బోర్డు

image source : freepik

TS Gurukula Exam | తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి గురుకుల నియామక బోర్డు ( TREIRB ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. బోధన, భోధనేతర సిబ్బంది భర్తీ ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పోస్టుల ఆధారంగా ఈ పరీక్షలు అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాలు అన్నీ కలిపి మొత్తంగా 9,210 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ రిక్రూట్‌మెంట్ బాధ్యతను గురుకుల నియామక బోర్డుకు అప్పగించింది. ఈ క్రమంలోనే 9 కేటగిరీలకు 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ పోస్టులకు గత నెల 27 వరకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా పరీక్షల తేదీలను ట్రిబ్ ప్రకటించింది. పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు కన్వీనర్ డా.మల్లయ్య భట్టు తెలిపారు.

పోస్టుల వివరాలు..
పీజీటీ1276
టీజీటీ4020
జూనియర్ లెక్ఛరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్2008
డిగ్రీ లెక్ఛరర్, పీడీ, లైబ్రేరియన్868
లైబ్రేరియన్ స్కూల్434
స్కూల్ ఫిజికల్ డైరెక్టర్275
డ్రాయింగ్, ఆర్ట్ టీచర్లు134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్లు92
మ్యూజిక్ టీచర్లు124

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version