Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (16-06-2023)

Daily Horoscope | రాశిఫలాలు (16-06-2023)

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

కొత్త స్నేహితులు పరిచయమవుతారు. సమష్టిగా నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి.

వృషభం

మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మిథునం

భవిష్యత్తులో ఉపకరించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాహనాన్ని మార్చే సూచనలు ఉన్నాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తారు.

కర్కాటకం

అనుకోకుండా చికాకులు ఎదురవుతాయి. ఇంటి మరమ్మతులు చేపడతారు. మాయమాటలతో మోసపుచ్చేవారు మీ దగ్గరలోనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి.

సింహం

నత్తనడకన సాగుతున్న పనుల్లో చురుకుదనం తీసుకురావడానికి విశేషంగా శ్రమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధనలాభ సూచన కలదు.

కన్య

సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. క్రయవిక్రయాలతో లాభాలు పొందుతారు. ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉన్నతమైన భావాలను కలిగి ఉంటారు.

తుల

రాజీలేని ధోరణి కనబరుస్తారు. ధనానికన్నా.. ధర్మమే ముఖ్యమని భావిస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆత్మీయులను మందలిస్తారు. వాహన సంబంధమైన విషయాలకు ప్రతికూలం.

వృశ్చికం

ఆశ్చర్యం కలిగించే సమాచారాన్ని తెలుసుకుంటారు. అపాత్రదానం చేస్తారు. దుష్ర్పచరాలను సమర్థవంతంగా తిప్పికొడతారు. సంతృప్తిని అలవరచుకుంటే జీవితం సుఖమయం అవుతుంది.

ధనుస్సు

మీపై నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలు అధికమవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది.

మకరం

ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశం పనికిరాదు. ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. ఖర్చులు అధికమవుతాయి.

కుంభం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను పరిశీలిస్తారు. టెక్నికల్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

మీనం

శ్రమ అధికమవుతుంది. ఆర్థికంగా కాస్త ఊరట పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లాభాలు పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version