Home Entertainment Tollywood Hero Naveen Reddy | రూ.55 కోట్ల మేర మోసం చేసిన టాలీవుడ్ హీరో...

Tollywood Hero Naveen Reddy | రూ.55 కోట్ల మేర మోసం చేసిన టాలీవుడ్ హీరో నవీన్ రెడ్డి .. అరెస్టు చేసిన పోలీసులు!

Tollywood Hero Naveen Reddy | టాలీవుడ్ లో హీరోగా చెప్పుకుంటూ చెలామణీ అవుతున్నాడు నవీన్‌ రెడ్డి అట్లూరి. సినీ పరిశ్రమకి రాకముందు అతను ఎన్‌ స్వ్కేర్‌ కంపెనీలో డైరెక్టర్‌ గా పని చేసి… కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టి మోసం చేశాడు.

అంతేకాకుండా ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులన్నింటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నాడు. తాజాగా ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయ్యాడు నవీన్. ఈ మేరకు అతను సుమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్‌ మీద ఎన్‌ స్క్వేర్‌ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు అతని మీద సెక్షన్లు 420, 465, 468, 471 r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు సీసీఎస్‌ పోలీసులు. కేసు నమోదు చేసిన తరువాత అతనిని విచారించిన పోలీసులు నవీన్‌ ను చర్లపల్లి జైలుకు రిమాండ్‌ కు తరలించారు. మోసం చేసి సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేసేవాడని, అంతేకాకుండా తనే హీరోగా నోబడీ అనే సినిమా కూడా తీసినట్లు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Minister KTR | అవును మాది కుటుంబ పాలనే… ఆ కుటుంబానికి పెద్ద కేసీఆర్‌!

Exit mobile version