Home Latest News Tragedy | తండ్రి నిర్లక్ష్యం.. బస్సు చక్రాల కింద నుజ్జునుజ్జయిన ఇద్దరు పిల్లలు.. ఫాదర్స్ డేకి...

Tragedy | తండ్రి నిర్లక్ష్యం.. బస్సు చక్రాల కింద నుజ్జునుజ్జయిన ఇద్దరు పిల్లలు.. ఫాదర్స్ డేకి రెండ్రోజుల ముందు విషాదం

Tragedy | ఓ తండ్రి నిర్లక్ష్యం ఇద్దరు పిల్లలను బలితీసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు నడపడంతో ఇద్దరు పిల్లలు బస్సు చక్రాల కింద నలిగి నుజ్జునుజ్జయిపోయారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా మంగపేటలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే మంగపేటకు చెందిన సురేశ్ తన భార్య, కొడుకు, కూతుర్ని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నాడు. తెలంగాణ సెంటర్ వద్దకు వచ్చిన సురేశ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును పట్టించుకోలేదు. పైగా చౌరస్తాలో నెమ్మదిగా వెళ్లాలనే స్పృహ కూడా లేకుండా బైక్‌ను వేగంగా బస్సు ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీకొనడంతో బైక్‌తో పాటు సురేశ్, అతని భార్య చెరో పక్కకు ఎగిరిపడ్డారు. ముందు కూర్చున్న పిల్లలు మాత్రం బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజిని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

https://twitter.com/SajjanarVC/status/1669901861913231361?s=20

నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణమని అభిప్రాయపడ్డారు. రహదారులపై వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని సూచించారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bandi Sanjay | ధరణిని రద్దు చేయం.. కేసీఆర్ పథకాలను అలాగే కొనసాగిస్తాం.. రూట్ మార్చేసిన బండి సంజయ్

Pawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Adipurush | ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన హనుమంతుడు.. జై శ్రీరామ్ అంటూ మార్మోగిన సినిమా హాల్

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

Exit mobile version