Home Lifestyle Health Corona Nasal Spray | గుడ్‌న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్‌.. కరోనా ఇంజెక్షన్‌, నాజల్‌ స్ప్రేలో...

Corona Nasal Spray | గుడ్‌న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్‌.. కరోనా ఇంజెక్షన్‌, నాజల్‌ స్ప్రేలో ఏది బెటర్‌?

Corona Nasal Spray | కరోనా వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముక్కు ద్వారా అందించే ( Nasal Spray ) కరోనా వ్యాక్సిన్‌ను త్వరలో బూస్టర్‌డోస్‌గా తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కోవాగ్జిన్‌ టీకా నుంచి నాజల్‌ వ్యాక్సిన్‌ రూపంలో దీన్ని అందించనున్నట్లు పేర్కొంది. డీజీసీఏ ఆమోదం పొందగానే ఈ బూస్టర్‌ డోస్‌ను విడుదల చేయనుంది.

ఇప్పటికే నాజల్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు చివరి దశకు వచ్చాయని, వచ్చే వారంలో ఈ టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే 18 ఏళ్లు పైబడిన వారికే ఈ నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. చైనా సహా ఇతర దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కరోనా వ్యాక్సిన్లపై మరోసారి ఫోకస్‌ పెట్టింది. ఇప్పుడీ నాజల్‌ స్ప్రే అందుబాటులోకి వస్తే బూస్టర్‌ డోస్‌లు ఇవ్వడం వేగవంతం కానుంది.

సాధారణంగా కరోనా వ్యాక్సిన్‌ శరీరంలోకి ఎంటరయ్యేది ముక్కు, నోటి ద్వారానే. అక్కడి నుంచి గొంతులోకి, తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సమస్యలు వస్తాయి. ఇప్పుడున్న ఇంజెక్షన్‌ వ్యాక్సిన్‌తో పోలిస్తే నాజల్‌ స్ప్రేతో అదనపు ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. నాజల్‌ వ్యాక్సిన్‌లు శరీరంలోకి కరోనా ప్రవేశించే ముక్కు, శ్వాసనాళం వద్దే రక్షణగా ఉండనుంది. అంతేకాదు వీటిని నిల్వ చేయడంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. పంపిణీ కూడా సులభం అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలోనూ ఈ నాజల్‌ స్ప్రే గురించి చర్చించినట్లు సమాచారం. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సభ్యలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

PM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచన

Corona cases in India | భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ BF.7 కేసులు.. అప్రమత్తమైన వైద్య మండలి.. కీలక ఆదేశాలు జారీ

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

Omicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం చేస్తోంది ఇదే

Exit mobile version