Home Latest News YS Sharmila | కేసీఆర్‌ సర్కార్‌ అణిచివేస్తున్నా వెనక్కి తగ్గని వైఎస్‌ షర్మిల.. వీరిద్దరి వ్యహహారంతో...

YS Sharmila | కేసీఆర్‌ సర్కార్‌ అణిచివేస్తున్నా వెనక్కి తగ్గని వైఎస్‌ షర్మిల.. వీరిద్దరి వ్యహహారంతో ప్రతిపక్షాలపై ఎఫెక్ట్‌!

YS Sharmila | కేసీఆర్‌ ( KCR ) ప్రభుత్వం ఎంతగా అణచివేసేందుకు ప్రయత్నించినా వైఎస్‌ షర్మిలా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. షర్మిల పాదయాత్ర చేస్తున్న వాహనాన్ని, బ్యానర్లను టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తగులబెట్టినా ఆమె వెనక్కి తగ్గలేదు. దానికి ధీటుగా ప్రగతిభవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో షర్మిలను అరెస్టు చేశారు. ఆమె కారులో ఉండగానే టోయింగ్‌ వ్యాన్‌కు కట్టి పోలీసులు లాక్కెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌ రావడం, గవర్నర్‌ను కలవడం జరిగింది. ఇదే ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు ప్రచారం కూడా జరిగింది. షర్మిలకు కాల్‌ చేసి మాట్లాడినట్లు పేపర్లో రావడం, సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయింది. ఏదేమైనా మీడియాలో సోషల్‌ మీడియాలో షర్మిలకు మైలేజ్‌ బాగానే వచ్చింది.

పాదయాత్రను అడ్డుకోవడం వ్యూహాత్మకమేనా ?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం షర్మిల పాదయాత్రకు అనుమతివ్వకపోవడంతో కోర్టు నుంచి కూడా పర్మిషన్‌ తెచ్చుకుంది. అయితే తాజాగా పోలీసులు పాదయాత్రకు పర్మిషన్‌ నిరాకరించడంతో షర్మిల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఆమరణ దీక్షకు దిగింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను కేసీఆర్‌ నొక్కేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మరోసారి షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోటస్ పాండ్‌లో ని ఆమె నివాసానికి తరలించారు. అయినా వెనక్కి తగ్గని షర్మిల వైఎస్ ఆర్‌టీపీ కార్యాలయం ముందే దీక్షకు దిగారు. రోడ్డుపైనే దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, షర్మిల దీక్షకు వైఎస్‌ విజయం సంఘీభావం ప్రకటించారు. మరోవైపు షర్మిల పాదయాత్రను వ్యూహాత్మకంగానే కేసీఆర్‌ అడ్డుకుంటూ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అణచివేతను సద్వినియోగం చేసుకుంటున్న షర్మిల

వైఎస్‌ షర్మిల పాదయాత్రను కేసీఆర్‌ సర్కారు అడుగడుగునా అడ్డుకుంటుండగా..ఆమె మాత్రం ఈ అణచివేతను రాజకీయంగా సద్వినియోగం చేసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆశించినంత మీడియాలో కవరేజ్‌ రాలేదు. కానీ గత కొద్ది రోజులుగా ఆమె యాత్ర పట్ల పోలీసులు, ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుతో షర్మిలకు ప్రజల్లో విపరీతమైన మైలేజ్‌ వచ్చేసింది. మీడియాలో ఫుల్‌ కవరేజీ వచ్చేసింది. ప్రధాని సైతం స్పందిచారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే.. షర్మిల ఎపిసోడ్‌తో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా చేయడంలో కేసీఆర్‌ కూడా సక్సెస్‌ అయ్యారనే చెప్పుకోవచ్చు. అందుకే షర్మిల వ్యవహారంలో కేసీఆర్‌ సర్కార్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Twist in Women Kidnap Case | ఆధిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. తండ్రికి ఫోన్‌ చేసిన యువతి..

Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా మెట్రో

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

Exit mobile version