Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLatest NewsLayoffs | లేఆఫ్స్ వేళ టెకీలకు టీసీఎస్ గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతాం కానీ జాబ్‌లో...

Layoffs | లేఆఫ్స్ వేళ టెకీలకు టీసీఎస్ గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతాం కానీ జాబ్‌లో నుంచి తీసేయమని ప్రకటన

Layoffs | చాలా కంపెనీలు ఇప్పుడు లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తుతున్న నేపథ్యంలో కాస్ట్ కటింగ్‌లో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలు మాత్రమే కాదు.. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం పింక్ స్లిప్స్ ఇచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టెకీలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( టీసీఎస్ ) గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీలో ఒక్కసారి చేరిన తర్వాత వారిని లేఆఫ్స్ పేరిట అస్సలు తొలగించమని స్పష్టం చేసింది. అవసరమైన స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా తమ కంపెనీలో ఆఫర్స్ ఇస్తామని ప్రకటించింది.

పలు కంపెనీలు తమకు అవసరమైన వారి కంటే ఎక్కువ మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం వల్లే ఇప్పుడు ఇలా లేఆఫ్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ముఖ్య అధికారి మిలింద్ లఖడ్ అభిప్రాయపడ్డారు. మిగిలిన కంపెనీల తరహాలో టీసీఎస్ అలా ఎన్నటికీ చేయదని స్పష్టం చేశారు. ఒక ఉద్యోగి నుంచి వేతనానికి సమానమైన పనిచేయించుకోవడం కంపెనీ చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. అందుకే ఒక ఉద్యోగిని నియమించుకున్న తర్వాత అతనిలో స్కిల్స్ తక్కువగా ఉన్నాయని అనిపిస్తే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించి పనిచేయించుకుంటామని పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ కంపెనీలో 6 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారని.. వారందరికీ కూడా గతంలో మాదిరిగానే వార్షిక వేతన పెంపు ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు చాలామందిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాయని.. అలా జాబ్ పోయిన వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన వారికోసం వెతుకుతున్నట్లు చెప్పారు. టీసీఎస్ చెప్పిన ఈ న్యూస్‌తో ఉద్యోగాలు కోల్పోయిన టెకీల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News