Tuesday, July 23, 2024
- Advertisment -
HomeLatest NewsKTR with Eetela | మీరేందుకు రాలేదు..? మీరు పిలిస్తేనే కదా వచ్చేది.. కేటీఆర్‌, ఈటల...

KTR with Eetela | మీరేందుకు రాలేదు..? మీరు పిలిస్తేనే కదా వచ్చేది.. కేటీఆర్‌, ఈటల మధ్య ఆసక్తికరమైన సంభాషణ

KTR with Eetela | బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నాడే తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు కేసీఆర్‌, గవర్నర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఉభయసభలను ఉద్దేశిస్తూ ప్రసంగించేందుకు వచ్చిన తమిళిసై ని స్వయంగా కేసీఆర్‌ ఆహ్వానించడం ఒక ఎత్తైతే.. ఈటల దగ్గరికి వెళ్లి కేటీఆర్‌ మాట్లాడటం మరో ఎత్తు.

బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌, రాజాసింగ్‌ను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. కాసేపు మాట్లాడారు. ఎప్పుడు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఉప్పునిప్పులా ఉండేవారు ఈరోజు మాత్రం సామరస్యంగా మాట్లాడుకున్నారు. వీరిలో మరి ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హూజురాబాద్ ఎమ్మెల్యే ఈటలతో కేటీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు‌.

హూజూరాబాద్‌ అధికారిక కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేదు ? అంటూ ఈటలను ప్రశ్నించారు కేటీఆర్. దానికి పిలిస్తేనే కదా హాజరయ్యేది అంటూ ఈటల సమాధానమిచ్చారు.వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వీరి మధ్యలోకి భట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చారు. కేవలం ఈటలను మాత్రమే కాదు నన్ను కూడా పిలవలేదన్నారు. ఎప్పుడూ మీరా మేమా అన్నట్లు ఉండే నేతలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో సఖ్యతగా మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ కు మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు సయోధ్య కుదిర్చాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం మొదలు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని.. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. ఈ అభివృద్ధికి సీఎం, మంత్రులు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ స్వర్గధామంలా ఉందని అన్నారు. ఇలా పాజిటివ్‌ సన్నివేశాలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన టికెట్లు

Governor Tamilisai | దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై ప్రశంసల వర్షం

Ponguleti Srinivas Reddy | వైఎస్సార్‌టీపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ? స్పష్టత ఇచ్చిన వైఎస్ షర్మిల

Minister KTR | దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. ముందస్తుకు వెళ్దాం.. బీజేపీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News