Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentSinger Sonu Nigam | ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఆస్పత్రికి...

Singer Sonu Nigam | ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఆస్పత్రికి తరలింపు

Singer Sonu Nigam | ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూ నిగమ్ పై ఎమ్మెల్యే కొడుకుతో పాటు అతని సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ముంబైలోని ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బృందం పై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సోనూతో పాటు అతని స్నేహితునికి, బాడీగార్డుకు కూడా దెబ్బలు తగిలాయి. దీంతో వారిని జైన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని చెంబూరులో సంగీత కచేరీకి సోనూ తన టీమ్‌ తో కలిసి వచ్చారు. ఆ సమయంలో కొందరు అభిమానులు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. కార్యక్రమం పూర్తి చేసుకొని మెట్లు దిగి వస్తున్న ఆయన వద్దకు వెళ్లగా ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.

కాగా అభిమానులు ఒక్కసారిగా రావడంతో రద్దీ చోటు చేసుకుంది. దీంతో సెక్యూరిటీ వారిని అదుపు చేస్తుండగా వారు సోనూ స్నేహితుడు రబ్బానీ ఖాన్‌ ను కిందకి తోసేశారు. ఈ తోపులాటలోనే సోనూ పై కూడా దాడి జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనలో వారు సెక్యూరిటీని కూడా తోసేశారు. అయినప్పటికీ వారు అందరినీ తిడుతూ దాడికి పాల్పడ్డారు.

ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్‌ ఫర్తేపేకర్‌ చెంబూర్‌ ఉత్సవంలో సోనూ ని కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ సోనూ సెక్యూరిటీ గాయకుడిని కలవడానికి వారిని పర్మిషన్ ఇవ్వలేదు.

దీంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అతని సహచరుడు రబ్బానీ ఖాన్ కిందపడేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కుమారుడు, అతని సెక్యూరిటీ సోనూనిగమ్ తోపాటు అతని స్నేహితుడిని దూషిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News