Thursday, April 25, 2024
- Advertisment -
HomeBusinessEPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. అధిక పింఛను కావాలంటే ఇలా అప్లై చేసుకోవాలి!

EPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. అధిక పింఛను కావాలంటే ఇలా అప్లై చేసుకోవాలి!

EPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ శుభవార్త చెప్పింది. అధిక పింఛనుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆగస్టు 31, 2014 తేదీ కన్నా ముందు నుంచే సభ్యులుగా ఉన్నట్లయితే.. వారికి ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం కల్పించింది. అధిక పెన్షన్‌ అందుకునేందుకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఈపీఎఫ్‌ఓ సోమవారం సర్య్కూలర్‌ విడుదల చేసింది.

ఇంతకు ముందు ఈ స్కీముకు అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోయిన ఉద్యోగులు ఇప్పుడు తాజాగా ఆప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీని కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరు అర్హులు, ఎప్పటి వరకు చివరి గడువు ఉంది? అనే వివరాలు ఇదిగో..

గత ఏడాది నవంబర్ 4న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈపీఎస్‌ స్కీమ్‌కు అర్హులైన ఉద్యోగుల్లో రెండు కేటగిరీలు ఉన్నాయి.అందులో మొదటిది 2014, సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగులు అధిక వేతనంపై అధిక పింఛనుని ఎంచుకుని చందా చెల్లిస్తున్నప్పటికీ వారి దరఖాస్తులను ఈపీఎఫ్ఓ తిరస్కరణకు గురైన వారు అర్హులు. వారు ఇప్పటికే పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. రెండోది ఆగస్టు 31, 2014 నాటికి ఈపీఎస్‌లో సభ్యులుగా ఉండి అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని కోల్పోయి ఉద్యోగులు అర్హులు.

తొలి కేటగిరీ ఉద్యోగుల కోసం 2022, డిసెంబర్ 29నే ఈపీఎఫ్ఓ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే, అధిక పెన్షన్ కోసం అర్హత ఉండి ఆప్షన్ ఎంచుకోలేకపోయిన వారి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన ఈపీఎఫ్ఓ.. తాజాగా మరో అవకాశం ఇస్తున్నట్లు మార్గదర్శకాలు జారీ చేసింది. పైన పేర్కొన్న రెండు కేటగిరీల ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం మార్చి 3, 2023 నాటికి దరఖాస్తు చేసుకోవాలని ఈపీఎఫ్ఓ తెలిపింది.

ఫిబ్రవరి 20, 2023న ఈపీఎఫ్ఓ జారీ చేసిన కొత్త సర్క్యూలర్ ప్రకారం.. అర్హత కలిగిన ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులు తమకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలకు ద్వారా విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్ఓ చట్టంలోని ప్యారా 11 (3), ప్యారా 11(4) సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. 2014లో గరిష్ఠంగా రూ.15 వేలకు వేతనం పెంచుతూ సవరణ చేసింది. గరిష్ఠ పరిమితితో సంబంధం లేకుండా అంతకు మించి వేతనం పొందుతున్న వారు ఈపీఎస్ లో జమ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అధిక వేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది.

కానీ, 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరని ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆప్షన్ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈపీఎఫ్ఓ కమిషనర్ సూచించిన ఫార్మాట్‌లో రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జాయింట్ ఆప్షన్‌కు సంబంధించిన ప్రత్యేక యూఆర్ఎల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత లింక్‌ను అందుబాటులో ఉంచింది.

ఈ యూఆర్ఎల్ ద్వారా సభ్యులు డిజిటల్‌గా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి రసీదు నంబర్ కేటాయిస్తారు. పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌ఛార్జులు జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను పరిశీలిస్తారు. వారి నిర్ణయాన్ని ఇ-మెయిల్, పోస్ట్, మెసేజ్ ద్వారా సభ్యులకు సమాచారం ఇస్తారు. జాయింట్ ఆప్షన్‌కు సంబంధించిన దరఖాస్తు, పేమెంట్ బకాయిలు వంటివి ఏవైనా ఫిర్యాదులు ఉంటే గ్రీవెన్స్ పోర్టల్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CIBIL SCORE | బ్యాంకు లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ సిబిల్ స్కోర్ పడిపోకుండా ఇలా జాగ్రత్త పడండి

Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చో తెలుసా !

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Pan Card Number | మీ పాన్ నంబర్ మాటిమాటికి మరిచిపోతున్నారా? ఈ చిన్న లాజిక్‌తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News