Friday, March 31, 2023
- Advertisment -
HomeLatest NewsRepublic Day | కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం.. తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల పరేడ్‌లో...

Republic Day | కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం.. తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల పరేడ్‌లో పాల్గొన్న ఈజిప్టు సైన్యం

Republic Day | దేశ రాజధాని ఢిల్లీలో 74 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఈజిప్టు ప్రెసిడెంట్ ఫతాహ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా కమాండర్ లెఫ్టినెంట్ ధీరజ్ సేథ్ నేతృత్వంలో కర్తవ్యపథ్నుంచి పరేడ్ మొదలైంది. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు జవాన్లు కవాతు నిర్వహించారు. త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, ఢిల్లీ పోలీసులు పాల్గొన్నారు. తొలిసారిగా ఈజిప్టు ఆర్మీ కూడా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడం విశేషం.

23 శకటాల ప్రదర్శన

పరేడ్‌లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి శకటాలు, 6 కేంద్ర మంత్రిత్వ శాఖ శకటాలు సందడి చేశాయి. ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అస్సాం, లడఖ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గుజరాత్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, దాద్రానగర్ హవేలీ శకటాలు ఆకట్టుకున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారంటే..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News