Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHealthCholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా...

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Cholesterol | మనం రోజూ తీసుకునే ఆహారం నుంచే శరీరంలో కొవ్వు తయారవుతుంది. మనం తీసుకునే పాలు, గుడ్లు, పాల పదార్థాలు, మాంసాహారం నుంచి శరీరానికి కొలెస్ట్రాల్‌ అందుతుంది. ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్‌ అయితే ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. పేరుకు తగ్గట్టుగానే ఒకటి మంచి చేస్తే ఇంకోటి చెడు చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గుండెపోటు రావడానికి కారణం ఇదే. పక్షవాతం ఏర్పడటానికీ ఇదే కారణం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ప్రయాణించడం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లే ధమనులలో అడ్డంకులు ఏర్పడుతుంది. అది పేరుకుపోయినప్పుడు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. మెదడుకు సరఫరా అయ్యే రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడితే పక్షవాతం వచ్చే ఛాన్స్‌ ఉంటుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని మంచి కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. దీన్ని పెంచుకోవడం వల్ల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్‌ అధికంగా ఉందంటే.. చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని అదుపులో ఉంచుకుంటే.. గుండెపోటు, పక్షవాతం నుంచి తప్పించుకోవచ్చు.

చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు

ప్రతి రోజూ అరగంట నడవడం, వ్యాయామం చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవచ్చు. ఇది పెరిగితే చెడు కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుంది. ప్రతి రోజు సగటున 8- 10 గ్లాసుల నీళ్లు తాగాలి. బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు ఆల్కహాల్‌, సిగరెట్లకు దూరంగా ఉండాలి. మాంసాహారాన్ని తగ్గించుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ఓట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ పావుగంట ప్రాణాయామం చేస్తే శ్వాసవ్యవస్థ శుభ్రమవుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cancer | చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను నిరోధించే ఛాన్స్‌.. ఏం చేయాలి !

Corona Cases | చైనాలో కరోనాతో వారంలో 13వేల మంది మృతి.. ఇంకా రోజుకు 30 వేల మరణాలు ఉంటాయని అంచనా!

covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

Covid 19 | చైనాలో 30 రోజుల్లో 60వేల మంది కరోనాతో మృతి.. ఎట్టకేలకు నోరువిప్పిన అధికారులు

Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?

Diabetes | ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని జయించొచ్చు.. ఏంటవి?

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News