Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు (21-12-2022 )

Horoscope Today | రాశి ఫలాలు (21-12-2022 )

Image Source : Pixabay

మేషం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తిగా చేస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుకుంటారు.

వృషభం

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. తండ్రి నుంచి ఆస్తిలాభం పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

మిథునం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు సూచన ఉంది.

కర్కాటకం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం

నూతన పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య

దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాల నుంచి బయటపడతారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరులను కలుసుకుంటారు.

తుల

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఎదురైన ఒడిదొడుకులు తీరుతాయి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు.

ధనుస్సు

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుంచి ధన వస్తు లాభం పొందుతారు. వాహన సౌఖ్యం కలదు.

మకరం

బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. షేర్లు భూ క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం.

కుంభం

మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తివ్యాపారాలు విస్తరిస్తారు.

మీనం

సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్‌.. కవిత, మాగుంట పేర్లు ప్రస్తావించిన ఈడీ

KTR fires on Bandi Sanjay | నేను క్లీన్‌చిట్‌తో వస్తా.. చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా ? బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్

Sircilla kidnap | సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ కేసులో ట్విస్ట్… మేమిద్దరం ప్రేమించుకున్నాం.. తల్లిదండ్రులతోనే మాకు ప్రాణహాని..

Exit mobile version