Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsPragna Reddy | పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ..

Pragna Reddy | పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ..

Pragna Reddy | పుల్లారెడ్డి స్వీట్స్ ( Pullareddy Sweets ) అధినేత జి. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరకట్నం పేరుతో రఘవారెడ్డి కుటుంబం తనను వేధిస్తున్నారంటూ తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి విజ్ఞప్తి చేశారు. మెయిల్ ద్వారా ఆమె చేసిన వినతిపై రాష్ట్రపతి స్పందించారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్, రాష్ట్రపతి ప్రైవేటు సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

తన భర్త, పుల్లారెడ్డి మనుమడు ఏక్‌నాథ్ రెడ్డి వేధిస్తున్నాడని ప్రజ్ఞారెడ్డి గతంలో పోలీసులను ఆశ్రయించింది. తనను ఒక గదిలో బంధించి గోడ నిర్మించారని ఫిర్యాదు చేసింది. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్యా రెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. తనతో పాటు తన 8 ఏళ్ల కుమార్తెను కూడా తీవ్ర వేధింపులకు గురి చేశారని తెలిపింది. ఇదే విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. గది బయట గోడ కూల్చివేయాలని కూడా ఆదేశించారు. ఇదే విషయాన్ని ప్రజ్ఞారెడ్డి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లారు.

తన భర్త, అతని కుటుంబంపై హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయని ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపింది. సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడింది. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తన ప్రైవేటు సెక్రటరీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. తమ లేఖపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News